Rambha Urvasi Menaka First Review: అల్లరి నరేష్ హిట్ కొట్టాడా..?
టాలీవుడ్ లో కామెడీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లరి నరేష్. 2002 లో అల్లరి సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో తొలి సినిమానే పేరుకు ముందు పెట్టుకున్నారు. ఆ తర్వాత తొట్టి గ్యాంగ్, మా అల్లుడు వెరీ గుడ్, కితకితలు, గోపీ గోడమీద పిల్లి, సీమశాస్త్రి, గమ్యం, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్, బ్లేడ్ బాబ్జి, ఫిట్టింగ్ మాస్టర్, బెండు అప్పారావు ఆర్ఎంపీ, కత్తి కాంతారావు, మడతకాజా, సుడిగాడు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు. ఆ తర్వాత మహర్షి, నాంది, ఉగ్రమ్, బచ్చలమల్లి, 12ఏ రైల్వే కాలనీ సినిమాలతో అటు క్రైమ్, థ్రిల్లర్ సినిమాలతోనూ మెప్పించారు. ఇప్పుడు మరోసారి తన కామెడీ టైమింగ్ తో వస్తున్న చిత్రం 'రంభ ఊర్వశి మేనక'.. ఈ మూవీ సెప్టెంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక అల్లరి నరేష్ ఖాతాలో హిట్టు పడి 5 ఏళ్లు పూర్తికావస్తోంది. 2021 లో వచ్చిన నాంది తో ఓ మంచి హిట్ అందుకున్నారు అల్లరి నరేష్. ఆ తర్వాత పలు సినిమాలు చేసినా అవి ఆశించినంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. ఈ చిత్రానికి చంద్రమోహన్ చింతాడా దర్శకత్వం వహించారు. అలాగే రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక తాజాగా ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలకి చూపించారట. సినిమా చూసిన తర్వాత వాళ్లు తమ అభిప్రాయాన్ని పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం రంభ ఊర్వశి మేనక సినిమా రన్ టైమ్ 2 గంటల 24 నిమిషాలుగా ఉంది. ఫస్టాఫ్ లో నాన్ స్టాప్ గా వచ్చే కామెడీ సీన్స్ మంచి హై ఇస్తాయని టాక్ వినిపిస్తోంది. ఇక సెకండాఫ్ లో తల్లి సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయిందని అంటున్నారు. రంభ ఊర్వశి మేనక సినిమా కచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా అని.. ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉందని చెబుతున్నారు.

ఈ మూవీ కథ విషయానికి వస్తే.. ఏపీలోని రాజమండ్రికి చెందిన సురభి (వీకే నరేష్), వీకే (అల్లరి నరేష్) తండ్రి కొడుకులు. అయితే వీరికి వంశ పారంపర్యంగా ఓ మ్యాజిక్ బుక్ ఉంటుంది. ఆ మ్యాజిక్ బుక్ పై సరిగ్గా ముగ్గు వేస్తే రంభ, ఊర్వశి, మేనక ప్రత్యక్షమవుతారని వీకే కు తండ్రి చెబుతాడు. దాంతో 25 ఏళ్లుగా ముగ్గు వేసి రంభ (రాశి సింగ్), ఊర్వశి (విష్ణుప్రియ), మేనక (ప్రిషా సింగ్) లను రప్పించేందుకు ప్రయత్నిస్తుంటాడు. చివరికి వీకే ముగ్గు ప్రయత్నం ఫలించి ఆ ముగ్గురు దేవ కన్యలు భూమిపైకి వచ్చారు. అయితే ఇంద్రలోకం నుంచి వచ్చిన వారికి భూమిపై ఏం జరిగింది..? వీకే వారి నుంచి ఏం కోరుకున్నారు..? అనేదే ఈ సినిమా స్టోరీ. మరి సెప్టెంబర్ 4 న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications