అల్లు అర్జున్ "రాకా" అస్సామేనా ? ఆ ఫ్లాప్ మూవీ స్టోరీ కాపీ కొట్టారా ??

ఐకాన్ స్టార్ "అల్లు అర్జున్" ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. పుష్ప.. పుష్పరాజ్ అంటూ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రెండు పార్టులుగా వచ్చిన ఈ మూవీ.. పాన్ ఇండియా లెవెల్లో భారీ హిట్ అందుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఘన విజయాన్ని సాధించింది. ఒక్క బాలీవుడ్ లోనే ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత పార్ట్ 2.. విడుదలైన రోజు నుంచే పుష్ప రాజ్ బాక్సాఫీస్ వద్ద తన హవాని చూపించాడు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దాదాపు 1800 కోట్లు వసూలు చేయడంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు.

ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ ప్రాజెక్టులపై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకున్నాయి. అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో వస్తున్న చిత్రం 'రాకా' ఈ మూవీని సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దాదాపు రూ.800 కోట్ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. చిత్రంలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ , రష్మిక మందాన కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

allu-arjun-and-atlee-raaka-movie-facing-high-trolls-on-social-media-about-story-and-latest-released

కాగా ఇటీవల ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే సందర్భంగా మూవీ టీమ్ ఫ్యాన్స్‌ కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమా టైటిల్ తో పాటు, అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసి మూవీపై బజ్ ను ఒక్కసారిగా పెంచేసింది. ఈ చిత్రానికి రాకా అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ లో అల్లు అర్జున్ లుక్ ను అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. గుండుతో, భారీ గోర్లు, బీస్ట్ స్టైల్ తో లుక్ ఉండడం అందరికీ షాక్ ఇచ్చింది. అంతే కాకుండా 'ఇది కేవలం ప్రారంభం మాత్రమే, మీ ఊహలకు మించి సినిమా ఉంటుంది' అని చిత్రబృందం ఇచ్చిన క్యాప్షన్ మరింత హైప్‌ ను పెంచేసింది.

అయితే రాకా కథ, అల్లు అర్జున్ పాత్రపై సోషల్ మీడియా వేదికగా అనేక ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన పాత్ర రెండు విభిన్న స్వభావాలతో ఉండబోతుందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. పగలు సాధారణ మనిషిలా ఉండే హీరో.. రాత్రి భయంకరమైన రాక్షసుడి లాగా మారిపోతాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం డ్యూయల్ రోల్ మాత్రమే కాకుండా.. ఒక సైకాలజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కథగా కూడా ఉండొచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒక పాత్ర పాజిటివ్ కాగా.. మరో పాత్ర నెగెటివ్ అని స్పష్టం అవుతోంది. అలానే కొందరు ట్రిపుల్ రోల్ కూడా ఉండొచ్చని ప్రచారం చేస్తున్నారు.

మరోవైపు సరిగ్గా ఇలాంటిదే, ఇప్పటికే ఇలాంటి కాన్సెప్ట్ తో "భేదియా" అనే హిందీ చిత్రం గతంలో విడుదలైంది. వరుణ్ ధావణ్, కృతి సనన్ నటించిన ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. మూడేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా రూ.40-రూ.45 కోట్ల మధ్య మాత్రమే వసూళ్లు రాబట్టింది. ఆ సినిమాలో కూడా హీరో పగలు మనిషిగా, రాత్రి మృగంలా ఉంటాడు. దాంతో అట్లీ ఆ సినిమా స్టోరీనే కాపీ కొట్టి కొంచెం అటు ఇటుగా చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు బలం చేకూర్చేలా అట్లీ - వరుణ్ ధావన్ కాంబినేషన్ లో "బేబీ జాన్" అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. వరుణ్ సరసన కీర్తి సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించారు. అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించిన తమిళ బ్లాక్ బస్టర్ 'తేరి'కి ఈ మూవీ రీమేక్ గా వచ్చింది.

ఇక రీసెంట్ గానే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. కాగా ఈ చిత్రానికి #AALoki #AA23 #LK7 వంటి వర్కింగ్ టైటిల్స్ చేయగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర గ్లింప్స్ షేర్ చేశారు. ఈ ఏడాదిలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ కానున్నట్లు తెలుస్తోంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+