నీకోసం త్రివిక్రమ్‌, సందీప్ వంగాను పక్కన పెట్టాలా? సుకుమార్‌పై అల్లు అర్జున్ ఫైర్?

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయాకుడగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప2 షూటింగ్ 80 శాతం పూర్తిచేసుకుంది. సినీ ప్రియులు ఎప్పుడు వస్తుందా? ఈ సినిమా అంటూ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో, వారి ఆసక్తికి తగ్గట్లుగా రోజురోజుకు ఆలస్యమవుతోంది. ఆగస్టు 15 నుంచి డిసెంబరు 6కు వాయిదాపడింది. కనీసం డిసెంబరు ఆరోతేదీనైనా సినిమా వస్తుందా? అంటూ వ్యంగ్యంగా కామెంట్లు వస్తుండటంతో ఈ సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ డిసెంబరులోనే రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

నీకోసం మరో మూడేళ్లు కేటాయించాలా?
ఈ సినిమా ఇంకా 20 శాతం షూటింగ్ జరుపుకోవాలి. 80 శాతం షూటింగ్‌కే సినిమా నిడివి నాలుగు గంటలు వచ్చింది. మరో ఇరవై శాతం అంటే ఇంకెంత నిడివి వస్తుందో అంటూ హీరో అల్లు అర్జున్ సుకుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాలుగు గంటలు వచ్చింది.. నీకోసం ఇప్పుడు మరో పార్ట్ తీయాలా? మరో మూడు సంవత్సరాలు నీతోనే ఉండాలా? త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగాను పక్కన పెట్టాలా? అంటూ అల్లు అర్జున్ సుకుమార్ పై ఫైర్ అయినట్లు వార్తలు వచ్చాయి.

Allu Arjun and Sukumar rift continues Pushpa 2 makers try to reconcile

గడ్డం తీసేసిన అల్లు అర్జున్
దీంతో దర్శకుడు సుకుమార్ ఎడిటర్ తో మాట్లాడి నిడివి తగ్గించమంటూ చెప్పి అమెరికా వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా అతన్ని అల్లు అర్జున్ కలవలేదని వార్తలు వచ్చాయి. భార్యాపిల్లలతో కలిసి బన్నీ విదేశాలకు వెళ్లిపోయాడు. అయితే బయటకు కనపడిన సమయంలో బన్నీకి గడ్డం లేదు. ఈ సినిమా మొత్తం హీరో గడ్డంతోనే కనపడతాడు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తికాకుండానే అలా గడ్డం తీసేస్తే అసలు తిరిగి షూటింగ్ మొదలవుతుందా? లేదా? అనే అయోమయంలో అభిమానులున్నారు. శుభ్రంగా గడ్డం తీసేని విదేశీ పర్యటనకు వెళ్లిపోవడంతో హీరోకు, దర్శకుడు సుకుమార్ కు మధ్య సయోధ్య కుదర్చడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందనేది కాలమే నిర్ణయించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+