ఇండియా మొత్తం మీద ఏకైక హీరోగా అల్లు అర్జున్..మెగా హీరోలు దరిదాపుల్లో కూడా లేరుగా..!

సినీ యావత్తు మొత్తం కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2 సినిమా కోసం అతృతుగా ఎదురు చూస్తోంది. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప మొదటి పార్ట్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిన విషయమే. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నార్త్ ఆడియోన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాకు గానూ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ హీరో అవార్డు సైతం గెలుచుకున్నారు.జాతీయ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ నిలిచారు.

బన్నీ తన మ్యానరిజంతో, యాక్టింగ్‌తో పుష్పను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టేశాడు. నార్త్ ఆడియెన్స్‌కు పుష్ప బాగా ఎక్కేసింది. అందుకే పుష్ప అక్కడ వంద కోట్లు కొల్లగొట్టేసింది. దీంతో 'పుష్ప-2'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం నార్త్ ఆడియెన్స్‌ ఎంతో అతృతుగా ఎదురు చూస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే సుకుమార్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు తెలుస్తోంది. తొలుత ఆగస్టు 15న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ, షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమాను వాయిదా వేశారు.

Allu Arjun became highest paid hero in India

డిసెంబర్ 6న ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అయితే 'పుష్ప-2'రిలీజ్ డేట్‌ను మరోసారి మార్చారు మేకర్స్.డిసెంబర్ 6న కాకుండా ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్ 5న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించారు. సినిమా ట్రైలర్ 17న విడుదల కానుంది. ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ భారీగానే రెమ్యూనిరేషన్ అందుకున్నట్టు సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు ఏ హీరో అందుకొని పారితోషకం అల్లు అర్జున్ ఈ సినిమాకు తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. పుష్ప-2 సినిమాగానూ అల్లు అర్జున్ దాదాపు రూ. 300 కోట్ల వరకు తీసుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ మూడేళ్ల పాటు తన సమయాన్ని వేచించారు. అలాగే శ్రీవల్లి పాత్ర చేసిన రష్మిక మందన్న రూ.10 కోట్ల రూపాయలను తీసుకుంది.

విలన్‌గా నటించిన ఫహద్ ఫాసిల్ 8 కోట్లమేర తీసుకున్నట్టు సమాచారం. సుకుమార్ దర్శకత్వ బాధ్యతల కోసం 15 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం . మరోవైపు మ్యూజిక్ కంపోజిషన్ కోసం దేవిశ్రీ ప్రసాద్ 5 కోట్ల పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఇండియా మొత్తం మీద అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా అల్లు అర్జున్ నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+