జూనియర్ ఎన్టీఆర్ నో చెప్పిన స్టోరీతో అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్!
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రం చేస్తున్నారు. ఇది రెండు భాగాలుగా రాబోతోందని డైరెక్టర్ కొరటాల శివ స్వయంగా ప్రకటించారు. దేవర మొదటి భాగం పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ తో చిత్రం చేయబోతున్నాడు. దీన్ని మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తోంది. జాన్వీకపూర్ కథానాయిక. అలాగే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 చేస్తున్నారు. దీన్ని కూడా మైత్రీమూవీసే నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కాబోతోంది. దర్శకుడు సుకుమార్.
గతంలో జూనియర్ ఎన్టీఆర్ తిరస్కరించిన ఓ కథతో అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అంతేకాదు.. ఒకరకంగా ఆ సినిమా అల్లు అర్జున్ కెరీర్ ను మలుపు తిప్పింది. అది ఏదో కాదు.. ఆర్య. ఆర్య చిత్రానికి సంబంధించిన కథ మొదటగా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ తీసుకువెళ్లాడు. అప్పటికే సింహాద్రి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి తారక్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. మాస్ ఇమేజ్ తో ఉన్న తనకు ఆర్య లాంటి ప్రేమ కథ సెట్ అవదని జూనియర్ భావించి ఆ సినిమాకు నో చెప్పాడు.

దీంతో సుకుమార్ దీన్ని అల్లు అర్జున్ దగ్గరకు తీసుకువెళ్లాడు. దానికి బన్నీ ఓకే చెప్పడంతో తెరకెక్కిన ఈ చిత్రం 2004లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్లోనే ఈ సినిమా రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తర్వాత ఇది బెంగాలీలో, ఒరియాలో, తమిళంలో కూడా రీమిక్స్ చేసి విడుదల చేయగా అక్కడా భారీ హిట్ కొట్టింది. ఈ చిత్రం తర్వాత దీనికి సీక్వెల్ గా సుకుమార్ ఆర్య2 చిత్రం తీశారు. అయితే ఇది ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచింది. అయితే అల్లు అర్జున్ నటన మాత్రం అందరి ప్రశంసలు పొందింది. ఒకరకంగా ఆర్య చిత్రం అల్లు అర్జున్ దశను మార్చేసిందని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications