కిర్రాక్ ఆర్పీ హోటల్‌పై అల్లు అర్జున్ అభిమానుల దాడి ..సంచలన విషయాలు వెలుగులోకి
అల్లు అర్జున్ అభిమానులు కమెడియన్ కిర్రాక్ ఆర్పీకి సంబంధించిన హోటల్‌పై దాడి చేశారనే వార్త గత కొద్ది రోజులుగా మీడియాలో వైరల్ అవుతోంది. జబర్దస్త్ కమెడియన్‌గా గుర్తింపు పొందిన కిరాక్ ఆర్పీ కూటమికి మద్దతు ప్రకటించారు. కిరాక్ ఆర్పీ అక్కడితో ఆగకుండా వైసీపీ నేతలపై ముఖ్యంగా కొడాలి నాని, రోజా, వల్లభనేని వంశీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ఫలితాలలో కూటమి అధికారంలోకి రావడంతో ఈయన పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ కూటమి విజయం పట్ల సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా వైసీపీ నేతలపై సంచలన కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా కిరాక్ ఆర్పీ అల్లు అర్జున్‌ను కూడా విమర్శించారు. అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవి చంద్ర కిషోర్ ఓడిపోయాడని.కానీ రాష్ట్రం కోసం పదేళ్లుగా కష్టపడుతున్న మావయ్య పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్ధికి సపోర్ట్ చేయడం నచ్చలేదని, దీని మెగా ఫ్యామిలీ స్పందించకపోయిన నేను స్పందిస్తానని తెలిపారు.అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్‌కు మద్దతు తెలపకపోవడం ముమ్మాటికి తప్పని ఈయన చెప్పడమే కాకుండా బన్నీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఒకనొక సమయంలో తన స్థాయిని మరిచి అల్లు అర్జున్‌పై కిర్రాక్ ఆర్పీ విమర్శలు చేయడంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. కిర్రాక్ ఆర్పీకి సంబంధించిన రెస్టారెంట్‌పై అభిమానులు దాడికి పాల్పడ్డారు. ఆయన చేపల పులుసు రెస్టారెంట్ పై దాడులు చేశారని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఈ దాడులు నిజంగా జరిగిందా లేదా అనుమానం కలిగింది. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. వాస్తవానికి ఈ వీడియోకు అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఎలాంటి సబంధం లేదు. ఓ హోటల్‌లో కస్టమర్లకు.. అక్కడి సిబ్బందికి మధ్య జరిగిన గొడవగా తేలింది. 2024 జనవరి 1న హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ఈ ఘటన జరిగింది. ఆ వీడియోను ఆర్పీ హోటల్‌పై అల్లు అర్జున్ దాడిగా కొందరు ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆర్పీ హోటల్‌పై అల్లు అర్జున్ అభిమానులు దాడి చేశారనేది ఫేక్ అని తేలిపోయింది.
Comedian RP hotel ni attack chesina Allu arjun fans😳 pic.twitter.com/ULe5tgJOQ0
— KALK! 2898ADᵒⁿ ²⁷‧⁰⁶‧²⁰²⁴🦸♂️ (@Shekhar_twts) June 6, 2024
Attack on customers at a restaurant: *Abids Grand Hotel waiters attacked customers*
— Saye Sekhar Angara (@sayesekhar) January 1, 2024
At midnight on December 31, waiters of the Grand Hotel behind the Abids Post Office attacked and injured customers with sticks. On hearing the matter Goshamahal MLA Rajasingh immediately… pic.twitter.com/ZKTAaJ4cxz












Click it and Unblock the Notifications