అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు రామ్ చరణ్ ఇలా దొరికిపోయాడేంటి..?
గత కొద్దికాలంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ సాగుతున్న సంగతి తెలిసిందే. పైకి అంతా బాగానే కనిపించినప్పటికీ లోలోపల మాత్రం అంతర్యుద్ధం సాగుతోంది. తెలియకుండానే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈక్రమంలోనే అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' సినిమాను మెగా హీరోల ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. ఈ సినిమా ఎలా హిట్ అవుతుందో చూస్తామంటూ మెగా అభిమానులు సవాల్ విసురుతున్నారు. వారికి ధీటుగానే అల్లు అర్జున్ అభిమానులు కౌంటరిస్తున్నారు.
ఇదే సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా 'పుష్ప-2'కి పోటీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేయడంతో అభిమానుల మధ్య మరింత చిచ్చు రేపినట్టు అయింది. పుష్ప-2 డిసెంబర్ 5న విడుదల చేస్తోన్నట్టు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. క్రిస్మస్ కానుకగా 'గేమ్ ఛేంజర్' విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు తొలుత ప్రకటించారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, 'గేమ్ ఛేంజర్' సినిమాను సంక్రాంతికి వాయిదా వేస్తున్నట్టు దిల్ రాజు తెలిపారు.

'గేమ్ ఛేంజర్' సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించడంతో పాటు దసరా సందర్భంగా డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. 2025 జనవరి 10వ తేదీన 'గేమ్ ఛేంజర్' సినిమాను విడుదల చేయబోతున్నారు. విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. దీపావళి సందర్భంగా 'గేమ్ ఛేంజర్'లోని ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ రౌడీలను కొట్టిపడేసి రైల్వే పట్టాల మీద పడేస్తాడు. అయితే ఈ పోస్టర్‌పై అల్లు అర్జన్ అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు.
రామ్ చరణ్ తమ హీరోను ఫాలో అయ్యాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అల్లు అర్జున్ పుష్పలో లుంగీ కట్టుకుని కనిపిస్తాడు. 'గేమ్ ఛేంజర్' రిలీజ్ చేసిన పోస్టర్‌లో రామ్ చరణ్ సైతం లుంగీ కట్టుకుని కనిపించాడు. ఇక సరిగ్గా అల్లు అర్జున్ మ్యానరిజంతోనే రామ్ చరణ్ కనిపించాడు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు రామ్ చరణ్ పోస్టర్‌పై ట్రోలింగ్‌కు దిగుతున్నారు. ఎవరైనా సరే మా హీరోను ఫాలో కావాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications