అల్లు అర్జున్ మాస్టర్‌మైండ్.. పక్కా ప్రణాళికతో ప్రభాస్‌పై దెబ్బ

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 చిత్రం చేస్తున్నారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ దర్శకుడు. ప్రత్యేక గీతం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. అది కూడా అయిపోతే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తారు. ఇప్పటికే వాటిని సగం పూర్తిచేస్తారు. డిసెంబరు ఐదోతేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. మనదేశంలో తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో విడుదల చేస్తున్నారు. పుష్ప1 తెలుగుకన్నా హిందీలోనే సూపర్ హిట్ కావడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

రూ.వెయ్యి కోట్ల వ్యాపారం జరిగింది
బాహుబలి2 సినిమా హిందీలో రూ.500 కోట్లకు పైగా రాబట్టింది. పుష్ప2 సినిమాకు రూ.వెయ్యి కోట్ల వ్యాపారం జరిగిందని చెబుతున్నారు. పుష్ప2 కూడా హిందీలో భారీ కలెక్షన్లు రాబట్టేలా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప సినిమాకు ముందు వరకు అల్లు అర్జున్ పారితోషికం రూ.40 కోట్లుగా ఉండేది. పుష్ప తర్వాత భారీగా పెరిగింది. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ.150 నుంచి రూ.200 కోట్లు తీసుకుంటున్నారు. ఒక్కోసారి సినిమా లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు. అలాగే అల్లు అర్జున్ కూడా పుష్ప2 సినిమాకు లాభాల్లో వాటాలు కావాలని నిర్మాతలను అడిగారు. దీనిప్రకారమే నిర్మాతలతో అల్లు అర్జున్ కు ఒప్పందం కుదిరింది.

Allu Arjun is planning to surpass Prabhas by getting more collections than Baahubali 2 in North india

ఒప్పందం ప్రకారం రూ.300 కోట్లు అందుతాయి
కుదిరిన ఒప్పందం ప్రకారం రూ.300 కోట్లు అందుతాయి. పుష్ప2పై అంచనాలు భారీగా ఉండటంతో బాహుబలి కలెక్షన్ల దగ్గరకు లేదంటే వాటిని దాటే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ పుష్ప2 ఈ మైలురాయిని అధిగమిస్తే పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రభాస్ తర్వాత అతిపెద్ద స్టార్ గా అల్లు అర్జున్ అవతరిస్తాడు. ఇతర భాషల్లోకన్నా ఉత్తరాది రాష్ట్రాల్లోనే ప్రభాస్ కలెక్షన్లను దాటి ముందుకు వెళ్లేలా అల్లు అర్జున్ గట్టి ప్రణాళికతో ఉన్నాడు. ఆ ప్రకారమే సినిమా విడుదలను ఒకరోజు ముందుకు జరిపారు. ఇదే జరిగి కలెక్షన్లు భారీగా వస్తే దేశ సినీ పరిశ్రమపై, ప్రధానంగా బాలీవుడ్ పై తెలుగు స్టార్ హీరోల అజమాయిషీ ఇంకా ఇంకా పెరుగుతుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+