ఆ బ్లాక్‌బస్టర్ తనకు పడలేదని అల్లు అర్జున్ ఒకటే బాధ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తాడా? త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తాడా? అనే ప్రశ్న అభిమానులను తీవ్రంగా వేధిస్తోంది. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం సన్ మూవీస్ బ్యానరుపై అట్లీ దర్శకత్వంలోనే చేయబోతున్నారని తెలుస్తోంది. కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఆయన జైలర్2 నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తున్నందుకు బన్నీ రూ.170 కోట్ల పారితోషికాన్ని పూర్తి వైట్ మనీగా తీసుకోబోతున్నారు.
ఆ సినిమా చూసిన తర్వాత నిద్ర కరవు
బన్నీ తన కెరీర్ లో ఒక సినిమా చేయలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతుంటారు. ఆ సినిమా తనకు పడుంటే అద్భుతంగా ఉండేది.. తన రేంజ్ మరోరకంగా ఉండేదనే ఆలోచనలో ఉండేవారు. గంగోత్రి సినిమా చేసిన తర్వాత ఏ సినిమా చేయాలా? అన్న ఆలోచనలో ఉండేవారు. అదే సమయంలో రవితేజ హీరోగా పూరీ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. దీన్ని చూసిన తర్వాత అల్లు అర్జున్ కొన్ని రోజులపాటు, కొన్ని నెలలపాటు ఇలాంటి సినిమా తనకు పడుంటే ఎంత బాగుండేదో అనుకునేవారు. ఇడియట్ కథ పోలికలు కొంత ఉండే ఆర్య సినిమాను సుకుమార్ దర్శకత్వంలో తన రెండో సినిమాగా చేశారు.

వినాయక్ భరోసా ఇవ్వడంతో..
అయితే సుకుమార్ దర్శకత్వంలో చేయడానికి బన్నీ వెనకాడారు. మొదటి సినిమా కావడంతో చేయాలా? వద్దా? అని ఆలోచించారు. అయితే దర్శకుడు వి.వి.వినాయక్ ఈ సినిమా చేయమని అల్లు అర్జున్ కు చెప్పారు. సినిమా బాగా రాలేదు అనే అనుమానం ఉంటే తాను కూడా చేసిపెడతానని చెప్పడంతో సినిమా చేసి విడుదల చేశారు. సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఎవర్ని అడిగినా పది వారాలు ఆడుతుందని చెబుతున్నారు. అయితే ఇంట్లో అన్నం తినకుండా దాన్నిగురించే ఆలోచిస్తున్న అల్లు అర్జున్ కు అతని తండ్రి అల్లు అరవింద్.. అనవసరంగా దాన్నిగురించి ఆలోచిస్తున్నావు.. పది వారాలు ఆడటం అంటే మాములు విషయం కాదన్నారు. అయితే సినిమా కచ్చితంగా 125 రోజులు ఆడుతుందని, చిరంజీవి చేతులమీదుగా షీల్డు అందుకుంటానని నమ్మకంగా చెప్పారు. ఆ మాటలే నిజమై సినిమా 125 రోజులు ఆడింది. ఫంక్షన్ లో చిరు చేతుల మీదుగా 125 రోజుల షీల్డును అందుకున్నారు.












Click it and Unblock the Notifications