'పుష్ప2' తర్వాత అల్లు అర్జున్ సినిమా ఖరారు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 చేస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మిక కథానాయిక. మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ రూ.400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ స్వరాలందిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్ జరుపుకున్న కొన్ని సన్నివేశాలు సరిగా రాకపోవడంతోపాటు ఐటంసాంగ్ తీయడంలో ఆలస్యం కావడంతో డిసెంబరు ఆరోతేదీకి వాయిదా వేశారు.

ఇప్పుడు వస్తే భారీ నష్టమే
పవన్ కల్యాణ్ అభిమానులతో ఉన్న గొడవ కారణంగా ఈ పరిస్థితుల్లో సినిమా విడుదలచేస్తే భారీగా నష్టపోతామనే ఉద్దేశంతో డిసెంబరుకు వాయిదా వేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మెగా కుటుంబానికి, అల్లు అర్జున్ కు గొడవలు ఇలా జరుగుతూనే ఉంటాయి. పుష్ప2 తర్వాత ఏ సినిమా చేయాలా అనే ఉద్దేశంలో ఉన్న బన్నీ అట్లీతో చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దాదాపుగా ఈ సినిమా ఖాయమైంది. అయితే దర్శకుడు రూ.80 కోట్ల పారితోషికం అడగడంతో నిర్మాణ సంస్థ అసలు సినిమానే వద్దనుకుంది. దీంతో అట్లీ ఈ సినిమా కథను సల్మాన్ ఖాన్ కు చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది.

allu arjun next movie director nelson dilipkumar confirm

త్రివిక్రమ్ కు దూరంగా..
త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తాడనుకున్నప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. గుంటూరు కారంతో సూపర్ ఫ్లాప్ కొట్టిన త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి బన్నీ ఉత్సాహం చూపించడంలేదు. చివరకు జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నెల్సన్ దిలీప్ కుమార్ చెప్పిన కథ అల్లు అర్జున్ కు బాగా నచ్చింది. యునివర్సల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. బన్నీతో రేసుగుర్రం సినిమాను నిర్మించిన నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) దీనికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. దిలీప్ కుమార్ జైలర్ సినిమా తీయడానికి ముందు, తీసే సమయంలో, తీసిన తర్వాత కూడా పలుమార్లు బన్నీని కలిసి కథను చెప్పినప్పటికీ ఇప్పటికి ఓకే అవడంతో అల్లు అర్జున్ అభిమానులు కూడా హమ్మయ్య అనుకుంటున్నారు. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమయ్యేది త్వరలోనే తెలపబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+