అల్లు అర్జున్ వద్దంటే సల్మాన్‌ఖాన్ బ్లాక్‌బస్టర్ కొట్టాడు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 చేస్తున్నారు. డిసెంబరు ఆరోతేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. మొదటిభాగం అంచనాలకు మించి హిట్ కావడంతో రెండో భాగంపై విపరీతమైన అంచనాలున్నాయి. సాధారణంగా ఒక దర్శకుడుకానీ, రచయిత కానీ సినిమాకు కథ రాసేటప్పుడు ఒక హీరోను దృష్టిలో ఉంచుకుంటారు. పూర్తయిన తర్వాత కథను హీరోకు వినిపిస్తారు. ఒక్కోసారి కథ ఎంత బాగున్నప్పటికీ కొన్ని కారణాలవల్ల ఆ హీరో తిరస్కరిస్తాడు. అటువంటప్పుడు వేరే హీరో చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న సందర్భాలు చిత్ర పరిశ్రమలో కోకొల్లలుగా ఉంటాయి.

రజనీకాంత్ కూడా వద్దన్నారు
ఈకోవలోనే 2015 సంవత్సరంలో నిర్మాత ఉదయవాణి భజరంగీ భాయిజాన్ సినిమా తీయాలనుకున్నారు. ఈ సినిమాకు కథను రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందించారు. హిందీలో సినిమా తీసేందుకు అల్లు అర్జున్ ను సంప్రదించగా తెలుగులో అప్పటికే బిజీగా ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతానికి బాలీవుడ్ లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని, తెలుగులోనే సినిమాలు చేస్తానని బన్నీ స్పష్టం చేశారు. దీంతో నిర్మాతలు రజనీకాంత్ ను సంప్రదించారు. అయితే తన పర్సనాలిటీకి ఈ కథ సరిపోదని చెప్పడంతో చివరకు సల్మాన్ ఖాన్ దగ్గరకు చేరింది.

Allu Arjun rejected Salman s Bajrangi Bhaijaan movie

అత్యధిక వసూళ్లు సాధించింది
ఆ తర్వాత ఈ కథ నిర్మాతల చేతులుమారి రాక్ లైన్ వెంకటేష్ దగ్గరకు రాగా ఆయన నిర్మాతగా, కబీర్ ఖాన్ దర్శకత్వంలో విడుదలైన భజరంగీ భాయిజాన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమా రికార్డు స్థాయిలో రూ.970 కోట్లు వసూలు చేసింది. అప్పట్లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ నాలుగో చిత్రంగా నిలిచింది. ఒక మంచి చిత్రంద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టే అవకాశాన్ని అల్లు అర్జున్ కోల్పోయాడని అభిమానులు బాధపడుతున్నారు. ఆ సినిమా చేసుంటే ఈరోజు ఇండియా వ్యాప్తంగా తిరుగులేని స్టార్ ఇమేజ్ హోదాతో స్టార్ హీరోగా ఉండేవాడని అంటున్నారు. ప్రస్తుతం పుష్ప సినిమాతో బన్నీ పాన్ ఇండియా హీరోగా మారారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+