వైసీపీ ట్వీట్‌కు అల్లు అర్జున్ రిప్లై..థాంక్యూ సో మచ్ అంటూ ..!
మెగా , అల్లు ఫ్యామిలీల మధ్య గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు. వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి నంద్యాల వెళ్లి మరీ తన మద్దతు ప్రకటించారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు.
ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికి, లోలోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఈక్రమంలోనే అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' సినిమాను మెగా హీరోల ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. ఈ సినిమా ఎలా హిట్ అవుతుందో చూస్తామంటూ మెగా అభిమానులు సవాల్ విసురుతున్నారు. వారికి ధీటుగానే అల్లు అర్జున్ అభిమానులు కౌంటరిస్తున్నారు.

అటు వైసీపీ అభిమానులు సైతం అల్లు అర్జున్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. జగన్, అల్లు అర్జున్‌తో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు వైసీపీ అభిమానులు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తాజాగా నటిస్తోన్న చిత్రం పుష్ప-2. వచ్చే నెల 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈక్రమంలో అల్లు అర్జున్‌కు విషెస్ చెబుతూ వైసీపీ నేత శిల్ప రవి ట్వీట్ చేశారు. పుష్ప-2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పోస్టు పెట్టారు. దీనికి స్పందించిన అల్లు అర్జున్.. థాంక్యూ సో మచ్ అని రిప్లై ఇచ్చారు.ఇప్పటికే మెగా కుటుంబంతో వార్ కొనసాగుతున్న తరుణంలో మరోసారి శిల్ప రవి ట్వీట్ పెట్టడం, దానికి బన్నీ వెంటనే రియాక్ట్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి దీనిపై మెగా ఫ్యాన్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.













Click it and Unblock the Notifications