అలాంటి కథతో అల్లు అర్జున్ మూవీ.. లోకీ రిస్క్ చేస్తున్నాడా..?
ఐకాన్ అల్లు అర్జున్ పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పుష్ప- 2 సినిమాకు నార్త్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీకి ఇండియా వ్యాప్తంగా కలెక్షన్స్ ఏకంగా రూ. 1800 కోట్ల వరకూ వచ్చాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు.
ఇక తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన గత మూవీ కూలీకి నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. రూ. 500 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. సూపర్ స్టార్ రజనీకాంత్, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి ప్రముఖ హీరోలు ఈ మూవీలో నటించారు. అయితే ఈ మూవీకి కలెక్షన్స్ వచ్చినప్పటికీ లోకేశ్ రేంజ్ మూవీ కాదని.. ఆయన గత సినిమాలతో పోల్చితే ఈ మూవీ చాలా సాధారణంగా ఉందని ఆడియన్స్ తేల్చేశారు.
దాంతో ఈసారి ఎలాగైనా పెద్ద హిట్ కొట్టి మళ్లీ తానేంటో నిరూపించుకోవాలని డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్- లోకీ కాంబోలో ఓ మూవీ అనౌన్స్ అయింది. సంక్రాంతి కానుకగా ఈ మూవీ థీమ్ ను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇక వీడియోలో విజువల్స్ గమనిస్తే ఇదేదో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే మూవీగా కనిపిస్తోంది.
అడవులు, జంతువులు, ఎత్తయిన కొండ మీద గుర్రం ఎక్కి బన్నీ దాన్ని అదిలించడం లాంటివి కనిపిస్తున్నాయి. ఈ చిత్రం గురించి తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే ఈ కథను లోకీ ఇంతకుముందు సూర్య, అమీర్ ఖాన్ లకు చెప్పాడట. వాళ్లు రిజెక్ట్ చేశారట. ఇప్పుడు ఈ స్టోరీనే లోకేశ్ కనగరాజ్ బన్నీకి చెప్తే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దాంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొందరు మాత్రం బన్నీ రిస్క్ చేస్తున్నాడు అంటూ మాట్లాడుకుంటున్నారు.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందుతోంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్, నెక్స్ట్ లెవల్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రత్యేక స్థానం సంపాదించుకోనుందనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications