అల్లు అర్జున్‌కు కౌంటరిచ్చిన సొంత తమ్ముడు
మెగా ఫ్యామిలీకి ధీటుగా అల్లు ఫ్యామిలీ నుంచి కూడా హీరోలు వచ్చిన సంగతి తెలిసిందే. అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన అర్జున్ స్టార్ హీరోగా ఎదిగి, తనకంటూ ప్రత్యేకంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ సైతం హీరోగా ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నాడు. అయితే అల్లు అర్జున్‌కు వచ్చినంత క్రేజ్ శిరీష్‌కు రాలేదనే చెప్పాలి. 'గౌరవం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్, కొత్తజంట, ఏబీసీడీ, క్షణం క్షణం , శ్రీరస్తు శుభమస్తు, ఊర్వశివో రాక్షసివో వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కిచుకున్నారు.
అయితే ఈ సినిమాలేవి కూడా అల్లు శిరీష్‌కు సరైన బ్రేక్ ఇవ్వలేకపోయాయి. దీంతో ఈసారి విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు ఈ అల్లు హీరో. అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన చిత్రం బడ్డీ. ఈ సినిమా జూలై 26న విడుదల కాబోతోంది.టెడ్డీబేర్‌తో ఒక యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. విడుదల తేదీ దగ్గరపడటంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.

దీనిలో భాగంగానే అల్లు శిరీష్ అభిమానులతో సరాదాగా ముచ్చటించారు.ఈ సందర్భంగా కొందరు మీరు కూడా మీ అన్న మాదిరగా సెపరేట్‌గా పీఆర్ టీమ్‌ని పెట్టుకొని ప్రేక్షకులకు దగ్గరవ్వచ్చుగా కదా అని అడిగారు. దీనికి అల్లు శిరీష్ సమాధానమిస్తూ ..వరసగా సినిమాలు చేస్తుంటే ఉంటే ప్రేక్షకులే మనల్ని గుర్తు పెట్టుకుంటారని వ్యాఖ్యానించారు. అంతేకాని ప్రత్యేకంగా సినిమాలను ప్రమోట్ చేయాల్సిన పని లేదంటూ అల్లు శిరీష్ కామెంట్స్ చేశాడు. మనం చేసిన సినిమాలే వారికి దగ్గర చేస్తాయి.
ఈ విషయంలో ప్రభాస్ నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి.సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ ప్రభాస్.ఆయన నటించిన సినిమా సంవత్సరానికి ఒక్కటైనా రిలీజ్ అవుతుంది.అయినా ఆయన బయట కనిపించేది చాలా తక్కువేనని అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు. ఆయన దగ్గర ఎలాంటి హంగు, ఆర్భాటం ఉండదని..తన సినిమాలను ప్రమోట్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువేనని అల్లు శిరీష్ తెలిపారు.తన సినిమాల ప్రమోషన్‌ని కూడా ఏదో నామమాత్రంగా చేసుకుంటారు అని తెలిపారు అల్లు శిరీష్.దీంతో అల్లు శిరీష్ చేసిన తన అన్న గురించే ఈ కామెంట్స్ చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అల్లు శిరీష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications