మెగా కాంపౌండ్ లో హైజోష్
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు, హీరో అల్లు శిరీష్ వివాహ తేదీ దగ్గరపడుతోంది. తన ప్రియురాలు నయనికతో కలిసి మార్చి 6వ తేదీన పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. దీనికి సంబంధించిన కార్యక్రమాలు అల్లు వారి ఇంట ఆరంభం అయ్యాయి. ప్రస్తుతం హల్దీ ఫంక్షన్ వేడుకగా సాగుతోంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను అల్లు శిరీష్ వదిన, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ ఫంక్షన్ లో ఆమె సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ నిలిచారు.
అల్లు శిరీష్, నయనికల నిశ్చితార్థ వేడుక గత ఏడాది అక్టోబర్ 31వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది అల్లు అరవింద్ కుటుంబం. ఈ సందర్భంగా వారు ఉంగరాలు మార్చుకున్నారు. అప్పట్లో పెళ్లి తేదీని వెల్లడించలేదు. ఈ ఏడాది పెళ్లి జరుగుతుందనే హింట్ అప్పుడే ఇచ్చారు. దీనికి అనుగుణంగా మార్చి 6వ తేదీన ముహూర్తాన్ని ఖరారు చేశారు.

టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న శిరీష్‌కు అభిమానుల నుండి అభినందనలు వెల్లువెత్తాయి. అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి వంటి అల్లు కుటుంబంలోని టాప్ సెలెబ్రెటీలందరూ ఈ పెళ్లి వేడుక సందర్బంగా ఒకే వేదిక మీదికి రాబోతోండటం ఇప్పటి నుంచే అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవికి వివాహ శుభలేఖ అందింది కూడా. అల్లు అరవింద్ మొదటి శుభలేఖను మెగాస్టార్ దంపతులకు అందించారు. వారి ఆశీర్వాదాన్ని కోరుకున్నారు.
ఇప్పటికే అన్న అల్లు అర్జున్ తన తమ్ముడి కోసం ఓ గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ పార్టీని కూడా ఏర్పాటు చేశాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అది ముగిసీ ముగియంగానే తాజాగా హల్దీ ఫంక్షన్ ఫొటోలు సందడి చేస్తోన్నాయి. ఈ ఫోటోల్లో అల్లు శిరీష్‌తో పాటు సుస్మిత కొణిదెల, ఇతర కుటుంబ సభ్యులు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. పసుపురంగు దుస్తుల్లో మెరిసిపోయారు. పెళ్లి పనులన్నింటినీ కూడా అల్లు అరవింద్, స్నేహా రెడ్డి దగ్గరుండి చూసుకుంటోన్నారు.












Click it and Unblock the Notifications