అల్లు అర్జున్ 'రాకా' గ్లింప్స్ సంచలనం..!! ఇదే నిజమైతే విధ్వంసమే..!!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ 'రాకా'.. ఈ చిత్రానికి సంబంధించి ఓ చిన అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సంచలనంగా మారింది. అల్లు అర్జున్ మునుపెన్నడూ చూడని విధంగా పోస్టర్ లో కనిపిస్తున్నారు. ఇక పుష్ప మూవీ సిరీస్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం ఇదే.. అటు 'జవాన్' వంటి భారీ విజయం తర్వాత అట్లీ తెరకెక్కిస్తున్న సినిమా కూడా ఇదే కావడంతో 'రాకా' చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీ ఒక హై- ఓల్టేజ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే రాకా చిత్రానికి సంబంధించి తాజాగా ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. రాకా మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ ఆగస్టులోనే 'రాకా' ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. రాకా సినిమా ప్రపంచాన్ని, స్కేల్ ను పరిచయం చేస్తూ మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ ఈ మూవీపై అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే.

రాకా మూవీలో అల్లు అర్జున్ కెరీర్ లోనే తొలిసారి త్రిబుల్ రోల్ చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అలాగే పునర్జన్మల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని కథలో భాగంగా బన్నీ మూడు విభిన్న కాలాలకు సంబంధించిన పాత్రల్లో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీకి సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొణె ఈ మూవీలో నటిస్తోంది. ఆమెతోపాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటించనున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ రష్మిక నెగెటివ్ రోల్ చేస్తుందంటూ సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక రాకా మూవీ 2027 సెకండ్ హాఫ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications