రాత్రికి రాత్రే పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ప్రెగ్నెంట్ అయిందా ఏంటీ..?

హీరోయిన్ అమలాపాల్ పెళ్లి సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రాత్రికి రాత్రే పెళ్లి చేసుకుని అందరికి బిగ్ షాక్ ఇచ్చింది. అమలాపాల్ వైవాహిక జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. దర్శకుడు విజయ్‌ను అమలాపాల్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. అన్నా సినిమాలో షూటింగ్ సమయంలో దర్శకుడు విజయ్‌‌తో అమలాపాల్ ప్రేమలో పడింది.

Amala Paul gets married for the second time

గాడంగా ప్రేమించుకున్న ఈ జంట సినీ పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన సంవత్సరానికే ఈ జంట విడాకుల బాట పట్టింది. దీంతో అమలాపాల్ మొదటి వివాహం అలా విషాదాంతంగా ముగిసింది. విడాకులు అనంతరం తిరిగి సినిమాల్లో నటించిన అమలాపాల్.. గతంలో కంటే హాట్‌గా కనిపించి అభిమానులను అలరించింది. పెళ్లి , విడాకులకు సంబంధించి పలు సందర్బాల్లో బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారామె.

Amala Paul gets married for the second time

ఇటీవల అమలాపాల్ రెండో పెళ్లికి సంబంధించి అనేక వార్తలు తెర మీదకు వచ్చాయి. ఈవెంట్ మేనేజర్ జగత్ దేశాయ్‌తో అమలాపాల్ ప్రేమలో ఉందని వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అక్టోబర్ 26న ప్రియుడు జగత్ దేశాయ్‌‌ను పరిచియం చేసిన అమలాపాల్ ..సరిగ్గా పది రోజుల్లోనే అతన్ని పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది. నిజానికి అమలాపాల్ ఇంత త్వరగా పెళ్లి చేసుకోవాలని అనుకోలేదట. కొన్నాళ్లు ప్రియుడుతో డేటింగ్ చేసి .. ఒకరినొకరు అర్థం చేసుకున్న తరువాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారట.

Amala Paul gets married for the second time

కాని ఇలా ఉన్నపలంగా అమలాపాల్ పెళ్లి చేసుకోవడం వెనక పెద్ద కారణమే ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అమలాపాల్ ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఆమె ప్రెగ్నెంట్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి. అమలాపాల్ బాడీలో కూడా చాలా మార్పులు కనిపిస్తున్నాయని..అందుకే అమలాపాల్ రాత్రికి రాత్రే పెళ్లి చేసుకుందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే అమలాపాల్ ప్రెగ్నెంట్ అయిందని వస్తున్న వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి అమలాపాల్ పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+