మైండ్ సెట్ మార్చలేం..విజయ్ దేవరకొండపై అనసూయ పోస్ట్ వైరల్
యాంకర్ అనసూయ మరోసారి వార్తల్లో నిలిచారు.తాజాగా తాను చేసిన ఓ పనితో ఆమె మరోసారి నెటిజన్లు టార్గెట్ అయ్యారు. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వారి పేర్లలో అనసూయ కూడా ఒకరు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
రంగస్థలం సినిమా తరువాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 38 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది.

ఫిజిక్ మెయిన్‌టైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవాల్సిందే. చీర కట్టిన, స్కార్ట్ వేసిన అది అనసూయకే చెల్లింది. అందం,నటనతో చాలామంది అభిమానులను సంపాధించుకున్న అనసూయ.. వివాదాలతో కూడా నిత్యం సహవాసం చేస్తూనే ఉంది.అనసూయ ఏం చేసిన, ఏం మాట్లాడిన సంచలనమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే ఇదే సమయంలో అనసూయ పలు వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలిచారు. అనసూయ గతంలో విజయ్ దేవరకొండపై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.
అర్జున్ రెడ్డి సినిమా విడుదల సమయంలో అనసూయ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.ఆమెను టార్గెట్ చేసుకుని విజయ్ దేవరకొండ అభిమానులు రెచ్చిపోయి విమర్శలు చేశారు. వల్గర్ కామెంట్స్ చేస్తూ అనసూయను ట్రోల్ చేశారు. అనసూయ సైతం విజయ్ అభిమానులకు ధీటుగానే కౌంటరిచ్చింది. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండను ఉద్దేశించి మరో పోస్ట్‌ను షేర్ చేసింది. గతంలో విజయ్ దేవరకొండ, పార్వతీ తిరువొత్తు, దీపికా పదుకొనే, ఆయుష్మాన్ ఖురానా మాట్లాడిన వీడియోను పోస్ట్‌ను షేర్ చేస్తూ కౌంటరిచ్చింది.

ప్రేమను వ్యక్తం చేసేందుకు అనేక దారులున్నాయి. కొట్టడం ఒక్కటే కాదు కదా.. ఇలాంటి సీన్స్ చేసే దర్శకుల మైండ్ సెట్ మార్చలేనప్పుడు నటులే అలాంటి సినిమాలు చేయకుండా ఉంటే సొసైటీకి మేలు జరుగుతుందనే విధంగా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇలాంటి పద్ధతులపై తన పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
భారీగా ఆస్తులు కూడబెట్టిన త్రిష.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో వీటిపై తీవ్ర చర్చ












Click it and Unblock the Notifications