సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్‌తో సైలెన్స్!
ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో తరచూ తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై తీవ్రస్థాయిలో స్పందించారు. నెట్టింట తనను లక్ష్యంగా చేసుకుని, వ్యక్తిగత విమర్శలు చేసేవారికి ఆమె తనదైన శైలిలో ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా తప్పు చేసే వారిని వదిలేసి.. ఆ తప్పును ఎదిరించే వ్యక్తిని టార్గెట్ చేయడంపై అనసూయ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమాజంలో ఇతరుల బాధను చూసి వినోదం పొందే సంస్కృతి పెరిగిపోతోందని.. ఇది చాలా ప్రమాదకరమని ఆమె ఆందోళన చెందారు.
ఇటీవల జరిగిన హోలీ సంబరాల్లో అనసూయ పాల్గొన్నప్పుడు, ఆమె మాట్లాడుతుండగా కొందరు వ్యక్తులు 'ఆంటీ' అని సంబోధిస్తూ కామెంట్స్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడమే కాకుండా.. దాన్ని ఆధారంగా చేసుకుని చాలామంది రీల్స్ చేయడం, హేళన చేయడం అనసూయను తీవ్రంగా కలచివేసింది. దీనిపై అనసూయ స్పందిస్తూ.. "వయసును బట్టి హేళన చేయడం, మహిళలపై వివక్ష చూపడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. కనీస సానుభూతి, సామాజిక బాధ్యత లేని వారిని సమాజం నిలదీయాలి" అని అనసూయ భరద్వాజ్ స్పష్టం చేశారు. మౌనంగా ఉంటే ఇలాంటివి మరింత పెరిగి.. క్రమంగా సమాజం మానవత్వాన్ని కోల్పోతుందని అనసూయ హెచ్చరించారు.

తను ఎదుర్కొంటున్న విమర్శలపై అనసూయ మరింత ధీమాగా మాట్లాడుతూ, "నేను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికి ఎప్పుడూ మొహమాట పడను. నా ప్రయాణం, నేను సాధించిన విజయాలు నాకు ఎంతో గర్వకారణం. ఎన్ని విమర్శలు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నా ధైర్యమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది" అని అనసూయ వెల్లడించారు. కష్టపడి పైకి వచ్చిన వారిని విమర్శించే హక్కు ఎవరికీ లేదని.. ట్రోలర్స్ చేసే హేళన తన ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం తగ్గించలేదని ఆమె తేల్చిచెప్పారు.
చివరగా సమాజంలో 'నాకెందుకులే' అని వదిలేసే ధోరణి పెరగడం వల్లే ఇలాంటి ట్రోలర్స్ రెచ్చిపోతున్నారని అనసూయ భరద్వాజ్ అభిప్రాయపడ్డారు. బాధ్యత గల పౌరులుగా ఇలాంటి సంస్కృతిని అందరూ ఖండించాలని అనసూయ పిలుపునిచ్చారు. అపహాస్యం చేసే వారికి భయపడకుండా, తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ, వృత్తిపరంగా ముందుకు సాగడమే తన లక్ష్యమని ఆమె చెప్పకనే చెప్పారు. అనసూయ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది, ఆమెకు మద్దతుగా చాలామంది నెటిజన్లు నిలుస్తున్నారు.












Click it and Unblock the Notifications