సిమెంట్ రంగంలో అంబుజా జోరు..తొలి త్రైమాసికంలో బంపర్ ఫలితాలు..!!
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్ ఆందోళనల మధ్య దేశీయ పారిశ్రామిక రంగాన్ని ముందుకు నడిపించే ఒక దృఢమైన ఆశాకిరణం కనిపిస్తోంది. అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్స్ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అత్యంత అద్భుతమైన ఆర్థిక ఫలితాలను సాధించింది. ఈ విజయం కేవలం కంపెనీ లాభాల పట్టికను మాత్రమే కాకుండా, సవాళ్లెదురైనా దేశ నిర్మాణ ప్రయాణాన్ని ఆపలేమనే బలమైన నమ్మకాన్ని దేశ ప్రజలలో కలిగిస్తోంది.
నిబద్ధత, అంకితభావంతో కూడిన ప్రణాళికలు ఉంటే ఎలాంటి నష్ట భయాలయినా ఎదుర్కోవచ్చని అంబుజా సిమెంట్స్ నిరూపించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ దాదాపు రూ. 9,500 కోట్ల భారీ ఆదాయాన్ని ఆర్జించింది. అదే సమయంలో నిర్వహణ ఎబిటా మునుపటి త్రైమాసికంతో పోలిస్తే టన్నుకు 27 శాతం అద్భుత వృద్ధిని నమోదు చేసి రూ. 931 కి చేరింది. ఇక నికర లాభాలు రూ. 660 కోట్లుగా నమోదవడం సంస్థ బలమైన వ్యవస్థాపకతకు నిదర్శనం.

పరిమితులను దాటిన ప్రగతి తపన
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారంగా మారినప్పటికీ, వ్యూహాత్మక కార్యాచరణతో అంబుజా సిమెంట్స్ టన్నుకు రూ. 206 వ్యయాన్ని విజయవంతంగా తగ్గించుకోగలిగింది. ఈ కఠోర శ్రమతో కూడిన వ్యయ నియంత్రణతో దేశ శ్రామికుల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా 119 మిలియన్ టన్నులకు పెంచాలని కంపెనీ శ్రమిస్తోంది. దాహేజ్, బటిండా, జోధ్‌పూర్ వంటి భిన్న ప్రాంతాలలో కొత్త విభాగాలు త్వరలోనే ఈ కలను సాకారం చేయనున్నాయి.
సంస్థ ఘనత కేవలం సిమెంట్ ఉత్పత్తిలోనే లేదు, విలువల పునాదిపై నిర్మితమైన నమ్మకంలో ఉంది. నేడు దాదాపు రూ. 71,954 కోట్ల నెట్ వర్త్‌తో ఎలాంటి రుణాలు లేని సంపూర్ణ రుణ రహిత అగ్రశ్రేణి సంస్థగా అంబుజా సగర్వంగా నిలిచింది. క్రిసిల్ ఇంకా కేర్ రేటింగ్స్ నుండి లభించిన అత్యున్నత ట్రిపుల్ ఏ రేటింగ్ ఈ సుస్థిర ప్రస్థానాన్ని మరింత గౌరవప్రదంగా మార్చింది.
పసిడి భవిష్యత్తు కోసం నిర్మలమైన పచ్చదనం
ప్రకృతిని ప్రేమిస్తూ, భవిష్యత్ తరాల జీవన భద్రతను కాపాడటమే నిజమైన అభివృద్ది అని అంబుజా సిమెంట్స్ బలంగా నమ్ముతోంది. అందుకే ఈ త్రైమాసికంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 973 మెగావాట్లకు విస్తరించి, తన హరిత విద్యుత్ వాటాను 34 శాతానికి పెంచుకుంది. పర్యావరణహిత తక్కువ కార్బన్ సిమెంట్ తయారీ కోసం యూకేకు చెందిన ప్రముఖ భాగస్వామితో నడుం కట్టింది. ఇది కేవలం పరిశ్రమ సాధించిన విజయం కాదు, మాతృభూమి సంరక్షణ కోసం వేసిన చారిత్రక అడుగు.
రాబోయే కాలంలో దేశీయంగా సిమెంట్ డిమాండ్ కొంత మందగించినప్పటికీ, బలమైన బ్రాండ్ ఇమేజ్, సుస్థిరమైన వ్యయ నియంత్రణలతో అంబుజా సిమెంట్స్ ఎదగడానికి సిద్ధంగా ఉంది. అభివృద్ధి ప్రస్థానం పర్యావరణ స్పృహతో సాగినప్పుడే మానవాళికి సముచిత భద్రత దక్కుతుందని ఈ విజయం పదేపదే గుర్తుచేస్తోంది. నవ్య భారతావని నిర్మాణంలో అంబుజా సిమెంట్స్ ప్రయాణం నిరంతరం స్పూర్తిదాయకంగా సాగుతూనే ఉంటుంది.












Click it and Unblock the Notifications
