రోజా,నాగబాబు ..అనసూయ మద్దతు ఎవరికంటే..?
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వారి పేర్లలో అనసూయ కూడా ఒకరు. న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
రంగస్థలం సినిమా తరువాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 38 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది.

ఇదిలా ఉంటే అనసూయ పొలిటికల్ ఎంట్రీ గురించి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది.పవన్ కల్యాణ్ కోరితే వచ్చే ఎన్నికల్లో జనసేన తరుఫున ప్రచారం నిర్వహిస్తానని ప్రకటించారు. దీంతో ఆమె జనసేనలో చేరడానికి రెడీ అయిందంటూ వార్తలు వెలిశాయి. దీనిపై అనసూయ క్లారిటీ ఇస్తూ..అక్కడి రిపోర్టులు అడిగిన ప్రశ్నలకు మాత్రమే నేను సమాధానం ఇచ్చానని అనసూయ తెలిపింది.
నాయకుడు నచ్చి..ఆ పార్టీ ఏజెండా నచ్చితే వారికి తప్పకుండా సపోర్టు చేస్తానని చెప్పాను. పవన్ కల్యాణ్ అంటే నాకు ఇష్టం. జనసేన పార్టీ అజెండా నాకెంతో నచ్చింది. అంతే కానీ ఆ పార్టీలో చేరతానని, ప్రచారాలకు వెళ్తానని తాను ఎప్పుడు చెప్పలేదని వివరణ ఇచ్చింది. తాజాగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అనుసూయకు ఊహించని ప్రశ్న ఎదురైంది.

నాగబాబు-రోజా చెరొక పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారని అనసూయను సదరు యాంకర్ ప్రశ్నించ..గాదీనిపై అనసూయ తనదైనశైలిలో సమాధానం ఇచ్చారు. రాజకీయలను పక్కన పెడితే నాగబాబు అండ్ రోజా ఇద్దరితో క్లోజ్‌గానే ఉంటానని ఆమె తెలిపింది. అయితే నాగబాబుతోనే కొంచెం ఎక్కువగా బాండింగ్ ఉంటుందని అంటూ ఇన్ డైరెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications