అనసూయ వీడియో వైరల్.. పబ్లిక్‌గా అలా చేయడంపై షాక్ !

అనసూయ భరద్వాజ్‌.. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేని వ్యక్తి. టెలివిజన్‌లో న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. ఈటీవీ షో 'జబర్దస్త్‌' ద్వారా బాగా ఫెమస్ అయ్యి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ క్రేజ్ ద్వారానే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. 40 ఏళ్ల వయస్సులో కూడా సూపర్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది.

తనదైన శైలిలో రాణిస్తూ దూసుకుపోతుంది. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ మెప్పిస్తోంది. క్షణం, రంగస్థలం, పుష్ప చిత్రాల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆమె కోసమే కొందరు దర్శకులు కథలు రాస్తున్నారంటే.. అనసూయ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

anchor-anasuya-strong-warning-about-misbehaviour-at-mall-opening-event

అయితే అందం , అభినయం రెండూ ఉన్న అనసూయకు.. వివాదాలు కూడా అలవాటు అయిపోయాయి అని చెప్పాలి. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ పలు అంశాలపై రియాక్ట్ అవుతూ ఉంటారు. ముద్దులు, హగ్గులు, బికినీలతో ఉండే పోస్టులు సైతం షేర్ చేస్తూ..ట్రోలింగ్ బారిన పడుతూ ఉంటారు. తనని విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా కౌంటరిస్తుంటుంది ఈ హాట్ బ్యూటీ. ఇప్పుడు లేటెస్ట్ గా అనసూయ మరోసారి అభిమానులపై మండిపడింది.

చెప్పుతెగుద్ది..

ప్రకాశం జిల్లా మార్కాపురం లోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఈవెంట్‌లో అనసూయ‌ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కొంద‌రు యువ‌కులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను చూసి అసహజంగా కామెంట్లు చేయడంతో.. "చెప్పు తెగుద్ది మీ ఇంట్లో అమ్మ, చెల్లి, భార్య ఉంటే వాళ్లని కూడా ఇలాగే కామెంట్లు చేస్తారా? పెద్దవాళ్లకు మర్యాద ఇవ్వడం మీ ఇంట్లో నేర్పించలేదా?' అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

అంతమంది మధ్యలో కూడా ఆమె ధైర్యంగా స్పందించిన తీరు పలువురిని ఆశ్చర్యపరిచింది. రంగమ్మత్త రియాక్షన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనసూయను వ్యాఖ్యాలపై నెటిజన్లు కూడా రియాక్ట్స్పం అవుతూ సపోర్ట్ చేస్తున్నారు. అనసూయ అంటే.. గ్లామర్ ఒక వైపు.. గట్స్ మరోవైపు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+