జానీ మాస్టర్ వివాదంలో యాంకర్ రష్మీ ఇరుక్కుపోయారే..!
జానీ మాస్టర్ వివాదం తెలుగు ఇండస్ట్రీలో ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆయన దగ్గర పని చూసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పుకొచ్చింది.జానీ మాస్టర్ భార్య అయేషా సైతం రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నాలుగు రోజులు పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న జానీ మాస్టర్‌ను గోవాలో అదుపులోకి తీసుకున్నారు.
Sexually exploiting a minor is different from cast and couch where two adults might have given consent to an individual choice
— rashmi gautam (@rashmigautam27) September 25, 2024
Pls do not use this interview now and mislead audience
This interview was taken way before 2020
Work place shud be comfortable and and when a girl… https://t.co/zexu8Xeohu
నార్సింగి పోలీసులు ఆయన్ను నేరుగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఉప్పరిపల్లిలోని పోక్సో కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు జానీ మాస్టర్‌కు 14 రోజుల పాటు అంటే అక్టోబర్ 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ వివాదంలోకి యాంకర్ రష్మీ చేరారు. రష్మీ కాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక అది చూసిన వారంతా జానీ మాస్టర్ అత్యాచార కేసులో ఇరుక్కోవడం గురించే అలాంటి కామెంట్స్ చేసిందని ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ వీడియోపై రష్మీ స్పందించారు.

''మైనర్‌ను లైంగికంగా వేధింపులకు గురి చేయడం కాస్టింగ్ కౌచ్‌కు చాలా తేడా ఉంది. కాస్టింగ్ కౌచ్ అనేది ఇద్దరి వ్యక్తుల వ్యక్తిగత ఎంపిక, సమ్మతికి సంబంధించినది. అయితే నేను 2020 కంటే ముందే నేను ఓ ఇంటర్వ్యూ ఇచ్చి పలు కామెంట్స్ చేసిన వీడియోను గత కొద్ది రోజుల నుంచి వైరల్ చేస్తున్నారు. దయచేసి ఈ వీడియోను ఇప్పుడు ఉపమోగించి నెటిజన్లను తప్పుదోవ పట్టించవద్దు. పని ప్రదేశాల్లో మహిళలు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా విషయంలో ఒక మహిళ నో అని చెబితే ఆమె అభిప్రాయాన్ని గౌరవించాలి'' అంటూ రాసుకొచ్చింది.మొత్తానికి జానీ మాస్టర్ వివాదంలోకి యాంకర్ రష్మీని లాగినట్టు అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మరోవైపు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ ను విచారణ జరిపేందుకు తమకు ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నిన్న ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన రంగారెడ్డి కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. ఇక ఈ క్రమంలో నేడు నార్సింగి పోలీసులు కోరినట్టు ఐదురోజులు కాకుండా నాలుగు రోజులపాటు జానీ మాస్టర్ ను కస్టడీకి ఇచ్చేందుకు అనుమతినిచ్చింది.
-
నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్నా: ఓపెన్ అయిన శ్రీదేవి -
ఆ సినిమా వదులుకోవడమే ప్రభాస్ కెరీర్‌కు ‘శ్రీరామరక్ష’ -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !! -
మెగాస్టార్ ఆ రెండు సినిమాలు అంటే బాలయ్యకు అంత ఇష్టమా..? -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
విజయ్ దేవరకొండ - రష్మికల్లో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? -
మరో కొత్త కాన్సెప్ట్..? గ్యాప్ ఇవ్వు అన్న కాస్తా..! -
గద్దర్ అవార్డుల్లో గీతా ఆర్ట్స్ హవా.. ఆయన మంత్రాంగం పనిచేసిందా? -
"నేను ఎంతమందితో తిరిగినా అది నీ ప్రాబ్లెమ్ కాదు" -
వీడియో వైరల్: స్నేహా రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. -
ఆ హీరోని చూస్తే సింహాన్ని చూసినట్టే - కోర్టు బ్యూటీ శ్రీదేవి -
"ఇది భగత్ గీత.. దమ్మున్నోడు దాటొచ్చు"











Click it and Unblock the Notifications