యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం
బుల్లితెర యాంకర్ రష్మీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మీ.. సినిమాల్లో సరైన అవకాశాలు దక్కకపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది. జబర్థస్త్ షోలో యాంకర్‌గా కనిపించిన తరువాత రష్మీ జాతకమే మారిపోయింది. జబర్థస్త్ షో రష్మీకి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది.
ముఖ్యంగా రష్మీ -సుడిగాలి సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. టీవీ రంగంలో రష్మీ -సుడిగాలి సుధీర్‌లపెయిర్ సంచలనం సృష్టించారని అని చెప్పాలి. వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్‌కి వెళ్లిపోయిందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో రష్మీ పలు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా అవకాశాలు దక్కించుకుంది.

ఇక రష్మీ జంతు ప్రేమికురాలనే విషయం అందరికి తెలిసిందే. కరోనా సమయంలో కూడా ఆమె రోడ్డు మీద ఉన్న జంతువులకు ఆహారం అందించి తన ఉదారతను చాటుకుంది. జంతువులను ఎవరైనా హింసిస్తే అదే రీతిలో ఫైర్ అయ్యేదామె. ఇదిలా ఉంటే రష్మీ ఇంట ఓ విషాదం చోటుచేసుకుంది. రష్మీ ఎంతో ప్రేమగా ఇష్టంగా పెంచుకున్న పెట్ డాగ్ మరణించింది. ఈ విషయాన్ని రష్మీ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది.
మరణించిన కుక్కపై రష్మీ పూలమాల వేసిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్‌గా స్పందించింది . చుట్కీతో తాను ఎంత ప్రేమగా గడిపానో అనే విషయాన్ని తెలుపుతూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది.'చుట్కీ గౌతమ్'ని కోల్పోయినందుకు చాలా బాధగా ఉందంటూ తన పెట్ డాగ్‌తో తీసుకున్న ఫొటోలను షేర్ చేసింది రష్మీ. చుట్కీ చనిపోవడానికి 24 గంటల ముందు దానితో గడిపిన ఫొటోలన్నీ షేర్ చేస్తూ చివరిలో అంత్యక్రియలు నిర్వహించి చుట్కీపై తన ప్రేమను ఘనంగా చాటుకుంది.












Click it and Unblock the Notifications