యాంకర్ రష్మీకి ఘోర అవమానం
యాంకర్ రష్మీ ఇటీవల కాలంలో నిత్యం వార్తాల్లో నిలుస్తున్నారు. లేటెస్ట్ ఫొటో షూట్‌లతో పాటు, తన కామెంట్స్‌తో రష్మీ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మీ.. సినిమాల్లో సరైన అవకాశాలు దక్కకపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది. జబర్థస్త్ షోలో యాంకర్‌గా కనిపించిన తరువాత రష్మీ జాతకమే మారిపోయింది. జబర్థస్త్ షో రష్మీకి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. బుల్లితెరపై తనకంటూ సపరేటు క్రేజ్‌ను యాంకర్ రష్మీ క్రియేట్ చేసుకుంది.
ఇక రష్మీ -సుడిగాలి సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. టీవీ రంగంలో రష్మీ -సుడిగాలి సుధీర్‌లపెయిర్ సంచలనం సృష్టించారని అని చెప్పాలి. వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్‌కి వెళ్లిపోయిందంటే వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే సుధీర్ సినిమాల్లో హీరోగా చేయడంతో బుల్లితెరకు దూరం అయ్యాడు. సుధీర్ లేకపోవడంతో రష్మీ హవా కూడా కాస్తా తగ్గింది.

దీనికి తోడు ఢీ షో నుంచి కూడా రష్మీ తప్పుకుంది. అయినప్పటికీ రష్మీ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మీ తన కెరీర్ విషయాలతో పాటు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. ఇదిలా ఉంటే రష్మీకి తెలుగు మాట్లాడటం పెద్దగా రాదనే విషయం అందరికి తెలిసిందే.
తాజాగా ఇది మరోసారి బయటపడింది. జబర్దస్త్‌లో ఓ స్కిట్‌లో భాగంగా కమెడియన్ రోహిణి తెలుగు పద్యాన్ని గడగడ చదువుతుంది. అయితే ఆ పద్యం చదవడానికి యాంకర్ రష్మీని స్టేజ్‌పైకి పిలిచింది. అయితే రష్మీ ఆ తెలుగు పద్యాన్ని చదవలేక దండం పెట్టేసింది. అయినా రోహిణి రష్మీని వదల్లేదు. ఆమెని మళ్లీ స్టేజ్‌పైకి పిలిచింది.
ఆ పద్యంలోని రెండో వ్యాఖ్యం చదవాలని బలవంతం చేసింది.రష్మీ ఆ పద్యాన్ని చదివి పెద్ద సాహసమే చేసింది. అయితే పద్యాన్ని చదవలేక నవ్వులపాలు అయ్యింది. ఆమె పదాలను పలికిన తీరుకి అక్కడున్న వారంతా కూడా షాక్ అయ్యారు. అంతేకాదు ఉల్లాసంగా, ఉత్సాహంగా అనమంటే లంగా, లెహంగా అని చెప్పడంతో రష్మీ పరువు మొత్తం పోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రొమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications