గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో యాంకర్ సుమ తాతయ్య...
తెలుగు సీరియల్స్‌తో ఎంట్రీ ఇచ్చిన యాంకర్ సుమ కనకాల. ఇప్పుడు ఎన్నో యేళ్లుగా తెలుగు ఇండస్ట్రీలో యాంకర్‌గా కొనసాగుతున్నారు. ఆమె మళయాళీ అమ్మాయి అయినప్పటికీ, తెలుగులో అనర్ఘళంగా మాట్లాడగలదు. గత 20 ఏళ్ల నుంచి తెలుగు ప్రేక్షకులను అటు టీవి షోలతోనూ, ఇటు ఈవెంట్స్‌తోనూ ఆకట్టకుంటున్నారు. అప్పుడప్పుడూ సినిమాల్లో నటిస్తూ..ఆడియో రీలిజ్‌లు, ఫ్రీ రిలీజ్‌లతో ఫుల్ బిజిగా ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా సోషల్‌మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు సుమ. ఇక, సుమ తన కొడుకును కూడా తెలుగు ప్రేక్షకులను పరిచయం చేసేందుకు సిద్ధమయ్యింది. ఈ మధ్యనే తన కొడుకు నటించిన సినిమా ప్రమోషన్లలో కూడా పాల్గొనడం జరిగింది.
రికార్డు క్రియేట్ చేసిన సుమ తాతయ్య : అయితే, ఇప్పుడు తాజాగా సుమ అభిమానులతో సోషల్‌మీడియాలోని తన ఖాతాలో ఒక విషయాన్ని పంచుకున్నారు. ఆమె తన తాతయ్య గురించి ఒక పోస్ట్ వేశారు. సుమ తాతగారికి 98యేళ్లు. ఈ వయసులో ఆయన ఓ రికార్డు క్రియేట్ చేశారు. తాతయ్య అంటే సుమ అమ్మమ్మ గారి బ్రదర్. ఆ తాతయ్యపేరు పి. బాలసుబ్రమణ్యన్ మీనన్? ఈయన న్యాయవాది. గత 73 యేళ్లనుంచి ఈయన ఈ వృత్తిలో కొనసాగుతున్నారు. ఇన్నాళ్ల లాంగ్ కేరీర్ కంప్లీట్ చేసుకున్న ఏకైక లాయర్‌గా తాతయ్య వరల్డ్ రికార్డును కైవసం చేసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఆయనకు అవార్డును అందజేసింది.

ఎన్నో యేళ్ల నుంచి యాంకరింగ్‌లో : యాంకర్ సుమ కనకాల ఈ విషయాన్ని ఎంతో గర్వంగా సోషల్‌మీడియాలోని తన ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. తన ఆనందాన్ని ఈ విధంగా వ్యక్త పరిచారు. సుమ పెట్టిన ఈ పోస్టు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అయితే, ఈ పోస్టుపై నెటిజన్లు కాస్త విభిన్నంగా స్పందిస్తున్నారు. సుమ యాంకరింగ్ వృత్తిలో ఎన్నో యేళ్లనుంచి కొనసాగుతున్నారని, ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇన్నేళ్లుగా యాంకరింగ్ ప్రొఫిషన్‌లో కొనసాగిన వ్యక్తి మరొకరు లేరు. అది కేవలం సుమ కనకాలకు మాత్రమే సాధ్యమయ్యింది. ఆమె మరి కొన్నేళ్లపాటు ఇలాగే కొనసాగితే.. గిన్నిస్ రికార్డు సుమని వరించడం ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications