తెలుగు సినీ ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్

తిరుమల శ్రీవారి లడ్డూ అపవిత్రం అయిందంటూ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. దీక్షలో భాగంగా ఆయన మూడోరోజు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం మెట్లను తానే స్వయంగా శుద్ధి చేశారు. దుర్గమ్మను దర్శించుకొని అపచారం జరిగిపోయిందని క్షమించాలంటూ వేడుకొని ప్రత్యేక పూజలు చేశారు. పదకొండు రోజుల దీక్షలో భాగంగా పవన్ కల్యాణ్ అలిపిరి నుంచి కాలినడకన స్వామివారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ స్పందిస్తున్న వైఖరిపై కొందరు విమర్శలు చేస్తుండగా, మరికొందరు మద్దతు పలుకుతున్నారు.

విరుచుకుపడ్డ పవన్ కల్యాణ్
తాను ఇస్లాంను, క్రిస్టియానిటీని నిందించలేదని, ప్రకాష్ రాజ్ అంటే తనకు గౌరవముందన్నారు. లడ్డూ విషయంలో ఎవరైనా అపహాస్యం చేసేలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే తమిళ హీరో కార్తీ ఓ కార్యక్రమంలో ఉన్న సమయంలో లడ్డూ కావాలా నాయనా? అంటూ ఎవరో అంటే.. ప్రస్తుతం అది చాలా సెన్సిటివ్ ఇష్యూ అని, మాట్లాడొద్దని అన్నారు. దీనిపై కూడా పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. ఒక హీరో సెన్సిటివ్ ఇష్యూ అంటున్నారని, సినీ పరిశ్రమకు చెందినవారు కొందరు లడ్డూమీద జోకులు వేస్తున్నారని, అవహేళన చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

andhra pradesh deputy cm pawan kalyan warning to telugu film industry

ఎవరూ అవహేళన చేయవద్దు
సినిమా వాళ్లకి తాను ఒకటే చెబుతున్నానని, మాట్లాడితే చాలా పద్ధతిగా మాట్లాడాలని, లేదంటే మౌనంగా కూర్చోవాలని, అవహేళన చేసేలా మాట్లాడితే మాత్రం ప్రజలు క్షమించరన్నారు. సెన్సిటివ్ ఇష్యూఅని మరోసారి అనవద్దన్నారు. ప్రకాష్ రాజ్ విషయంలోకానీ, కార్తీ విషయంలోకానీ పవన్ కల్యాణ్ స్పందన, మాట్లాడిన తీరు పరోక్షంగా తెలుగు సినీ పరిశ్రమలో ఎవరూ లడ్డూ విషయం గురించి అవహేళన చేసేలా మాట్లాడవద్దని, లేదంటే అసలు మాట్లాడకుండా మౌనంగా ఉండాలని అనేలా సూచనలిచ్చినట్లుగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ వైఖరిపై ప్రకాష్ రాజ్ ఒక్కరే బహిరంగంగా వ్యాఖ్యానించారు. విషయాన్ని పెద్దది చేయకుండా విచారణచేసి నిందితులను శిక్షిస్తే సరిపోతుందన్నారు. దీనికి పవన్ తీవ్రంగా స్పందించారు. ఈరెండు సంఘటనలను దృష్టిలో ఉంచుకొని దాదాపుగా సినీ పరిశ్రమ నుంచి ఎవరూ లడ్డూపై వ్యాఖ్యలు చేయరని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+