ఎన్టీఆర్ ఎఫెక్ట్.. ‘కాంతారా ఛాప్టర్‌-1’కు ఏపీ ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా 'కాంతార'. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం, కేవలం రూ. 14 కోట్ల బడ్జెట్‌తో రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రిషబ్ శెట్టి అద్భుతమైన నటన, దర్శకత్వం, సరికొత్త కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. 2023లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బ్లాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో, అసలు ఈ సినిమాకు మూలం అయిన కథను మొదటి పార్ట్‌గా తెరకెక్కించారు.

" 'కాంతారా ఛాప్టర్‌-1' " కథ మొదటి భాగం కథకు ముందు జరిగే కథగా ఉంటుంది. ఈ సినిమా కన్నడతో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల అవుతోంది. దీనిలో భాగంగానే తెలుగులో భారీ మార్కెట్‌పై కన్నేసింది 'కాంతారా ఛాప్టర్‌-1'. బిజినెస్ కూడా అదే రేంజ్‌లో జరిగింది. గతంలో ఈ సినిమాకు మద్దతుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ అంచనాలను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తెలుగు సినిమాల మాదిరిగానే, 'కాంతారా లెజెండ్ చాప్టర్ 1' (తెలుగు డబ్బింగ్ వెర్షన్) సినిమాకు ప్రీమియర్ షోతో పాటు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.

Andhra Pradesh Govt Grants Premier Show Ticket Hike for Rishab Shetty s Kantara Legend Chapter 1

హోంబలే ఫిల్మ్స్ LLP విజ్ఞప్తి మేరకు , ప్రభుత్వం సెప్టెంబర్ 30, 2025న ఈ అనుమతులు మంజూరు చేసింది.ప్రీమియర్ షో మంజూరు: సినిమా విడుదల తేదీ అక్టోబర్ 2, 2025 కాగా, అంతకంటే ఒక రోజు ముందుగా అక్టోబర్ 1, 2025న రాత్రి 10 గంటలకు ఒక ప్రీమియర్ షోలను ప్రదర్శించుకోవడానికి అనుమతి లభించింది.ప్రీమియర్ షోలకు సింగిల్ స్క్రీన్‌లలో రూ. 75/- ప్లస్ GST, మల్టీప్లెక్స్‌లలో రూ. 100/- ప్లస్ GST అదనంగా పెంచడానికి అనుమతి ఇచ్చారు. అక్టోబర్ 2, 2025 నుండి అక్టోబర్ 11, 2025 వరకు, సింగిల్ స్క్రీన్‌లకు రూ. 75/- ప్లస్ GST ,మల్టీప్లెక్స్‌లకు రూ. 100/- ప్లస్ GST వరకూ అదనంగా పెంచుకునేందుకు అనుమతి మంజూరైంది. తెలుగు సినీ హీరోల సినిమాలకు ఇచ్చినట్లే, ఈ కన్నడ డబ్బింగ్ చిత్రానికి కూడా ప్రీమియర్లతో పాటు టికెట్ రేట్ల పెంపునకు అనుమతి లభించడం పట్ల సినీ ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్టోబర్ 1 నుండే ఈ సినిమా సందడి తెలుగు రాష్ట్రాల్లో మొదలు కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+