రెండు బికినీలతో రచ్చ లేపిన తృప్తి దిమ్రి!!
రణబీర్ కపూర్ కథానాయకుడిగా, రష్మిక మందన్నా కథానాయికగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ మూవీ బాలీవుడ్ లో సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రూ. 900 కోట్లకు పైగా భారీ వసూళ్లను రాబట్టింది. బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించినప్పటికీ వీరందరికన్నా ఎక్కువ పేరు తెచ్చుకుంది మాత్రం తృప్తి దిమ్రి అని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా ఆమె పేరు వింటేనే కుర్రకారు నిద్ర కూడా పోవడంలేదు. 'యానిమల్' కు ముందు సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమాతో ఒక్కసారిగా తారాజువ్వలా ఎగిరింది.
బోల్డ్ రోల్‌లో మెప్పించింది
'యానిమల్'సినిమాతో తృప్తి దిమ్రి ఓవర్ నైట్ స్టార్ అయ్యిందంటే అందుకు కారణం సినిమాలో అత్యంత బోల్డ్ రోల్ చేయడమే. రణబీర్ కపూర్ తో శృంగార సన్నివేశాల్లో పాల్గొని వాటిని బాగా రక్తికట్టించింది. యానిమల్ తర్వాత త్రిప్తికి వరుస ఆఫర్లు రావడంతో స్టార్ బ్యూటీ గా మారింది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. అదిరిపోయే ఔట్ ఫిట్స్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఇటలీకి వెకేషన్ కు వెళ్లింది.

బ్లాక్ అండ్ బ్లూ బికినీలు
ఇటలీలో బ్లాక్ బికినీ ధరించి గ్లామర్ షో చేసింది. తన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో కుర్రాళ్లు అమ్మడు అందాలకు ఫిదా అవుతున్నారు. బ్లాక్ బికినీ ధరించి బీచ్ లో కూర్చొని రచ్చరచ్చ చేయడంతోపాటు బ్లూ కలర్ బికినీ కూడా వేసుకుంది. సన్ గ్లాసెస్ ధరించి హాట్ హాట్ ఫోజులిచ్చింది. ఇలా అయితే కష్టమని, దేశంలో కుర్రాళ్లను నిద్ర పోనివ్వకుండా చేస్తోందని, కొంచెం తగ్గాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం తృప్తి ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడును పుష్ప2 సినిమాలో ఐటం సాంగ్ లో నటింపచేయాలని దర్శకుడు సుకుమార్ ప్రయత్నిస్తున్నారు. భారీ పారితోషికాన్ని కూడా ఆఫర్ చేశారు. అయితే తృప్తి నటిస్తుందా? లేదా? అనే విషయంలో మాత్రం స్పష్టత రాలేదు.












Click it and Unblock the Notifications