Animal: బాక్సాఫీస్ వద్ద యానిమల్ వసూళ్ల వర్షం..
తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన మూవీ యానిమల్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం కేవలం ఐదు నుంచి ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల మార్కును దాటేందుకు సిద్ధంగా ఉంది. తాజా లెక్కల ప్రకారం ఈ మూవీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.425 కోట్లు వసూలు చేసింది.
Sacnilk ప్రకారం ఈ మూవీ విడుదలైన మొదటి రోజు రూ.60 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ప్రారంభ అంచనాల ప్రకారం సోమవారం రూ. 39.9 కోట్లు వసూలు చేసింది. దీనితో భారతదేశంలో మొత్తం బిజినెస్ రూ. 241 కోట్లకు చేరుకుంది. శనివారం రూ.66.27 కోట్లతో, ఆదివారం రూ.71.46 కోట్లు వచ్చాయి. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకారం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.520.79 కోట్లు రాబట్టింది.

యానిమల్‌లో రణ్‌బీర్‌తో పాటు అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న నటించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. T-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్‌పై నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా మొదటి 3 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ 355.65 కోట్లు వచ్చింది. తెలుగు రాష్ట్రాలు నుంచి 40.05 కోట్లు, తమిళనాడు 4.45 కోట్లు, కర్ణాటక 16.75 కోట్లు, కేరళ 1.30 కోట్లు, బాలీవుడ్ 178.05 కోట్లు, ఓవర్సీస్ రూ.115.05 కోట్లు వచ్చాయి.












Click it and Unblock the Notifications