విడాకులు తీసుకున్న మరో హీరోయిన్..భర్తతో విడిపోయానంటూ పోస్ట్
సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. సెలబ్రిటీలు ఎంత వేగంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారో అంతే వేగంగా విడాకులు కూడా తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే సినీ తారలు ఎక్కువైపోతున్నారు. ఏ రోజు ఎవరు విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది.
కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా మరో హీరోయిన్ విడాకులు బాట పట్టింది. తన భర్త నుంచి విడిపోతున్నట్లు ఓ హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు షీలా రాజ్ కుమార్ .

తమిళ ప్రముఖ నటి షీలా రాజ్ కుమార్ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించింది. దీనిపై పూర్తి వివారాల్లోకి వెళ్తే... కోలీవుడ్‌లో షీలా రాజ్ కుమార్‌కు మంచి గుర్తింపు ఉంది. క్లాసికల్ డాన్సర్‌గా పాపులారిటీ తెచ్చుకున్న షీలా రాజ్ కుమార్ ..అరదు చినమ్, నమ్మ విద్యాపిళ్లై ,మండేలా,బిచ్చగాడు -2 , జిగర్తాండ డబుల్ ఎక్స్ వంటి సినిమాల్లో నటించింది.
కెరీర్ బిజీగా ఉన్న సమయంలోనే షీలా ప్రేమ వివాహం చేసుకుంది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్న చోళన్ అనే వ్యక్తితో షీలా రాజ్ కుమార్ చాలా రోజులు ప్రేమయాణం సాగించింది. కొన్ని రోజులుకు తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది. సముద్రం మధ్యలో పెళ్లి చేసుకుని షీలా అప్పట్లో వార్తల్లో కూడా నిలిచింది.

కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో తరువాత అభిప్రాయభేదాలు తలెత్తిన్నట్టు తెలుస్తుంది. దీని కారణంగానే ఈ జంట విడాకులు తీసుకున్నారని సమాచారం. తాను వివాహ బంధం నుంచి బయటకు వచ్చానని షీలా రాజ్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే విడాకులు తీసుకోవడానికి గల కారణం మాత్రం ఆమె తెలియజేయలేదు. దీంతో షీలా రాజ్ కుమార్ విడాకుల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications