అందరిముందు చేయాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది!
అనుపమ పరమేశ్వరన్ కి సినీ పరిశ్రమలో హోమ్లీ ఇమేజ్ ఉంది. అయితే తాజాగా దాన్ని బద్దలు కొట్టింది. దీంతో అభిమానుల గుండెలు కూడా బద్ధలయ్యాయి. సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించిన టిల్లు స్క్వేర్ లో హీరోయిన్ పాత్ర చేసింది. ఒకరకంగా తనకు అది ఛాలెంజింగ్ రోల్ అని అనుపమ చెప్పింది. ఎన్నడూ చేయనిరీతిలో గ్లామర్ రోల్ చేసింది. ఇటువంటి పాత్రలు పోషించే అవకాశం ఎంతో అరుదుగా వస్తుందని, లిల్లీ పాత్రను తిరస్కరించివుంటే అంతకంటే తెలివితక్కువ నిర్ణయం మరొకటి ఉండదని వ్యాఖ్యానించింది.
దర్శకుడు ఇచ్చిన సూచనల మేరకే నటించానని, తన పాత్రకు న్యాయం చేశానంది. అటువంటి సన్నివేశాల్లో నటించడంపై ఆమె స్పందించారు. కెమెరా ఎదుట రొమాన్స్ చేయడం అంత సులువేం కాదన్నారు. హీరో, హీరోయిన్ మధ్య సాంగత్యం అనేది ప్రైవేట్ వ్యవహారమని, సెటల్ లో అందరిముందు చేయాలంటే.. వందమంది చూస్తుండగా రొమాన్స్ చేయాలంటే కష్టంగా ఉంటుందన్నారు. అందరూ కారులో ఉన్న సన్నివేశం గురించి అడుగుతున్నారని, అది తెరకెక్కించే సమయంలో ఎంతో అసౌకర్యంగా భావించానన్నారు. కానీ తప్పదని, నిజంగానే రొమాన్స్ చేస్తున్నట్లుగా నటించాలన్నారు.

రొమాంటిక్ సన్నివేశాల్లో తాము ఎంజాయ్ చేస్తున్నామని ప్రేక్షకులు భావిస్తుంటారని, అది సరికాదని, తమకు ఎంతో ఇబ్బందిగా ఉంటుందన్నారు. టిల్లు స్క్వేర్ ట్రైలర్ చూసిన ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అయిందని చెప్పొచ్చు. అనుమప క్యారెక్టర్ చూసినవారికి మతిపోయినంత పనైంది. కెరీర్ ప్రారంభం నుంచి ఆమెకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అయితే ఈ తరహా బోల్డ్ సన్నివేశాల్లో ఆమెను చూసిన కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. సావిత్రి, సౌందర్య అవుతుందనుకుంటే ఇలా చేసిందేమిటంటూ ఓ అభిమాని వీడియో విడుదల చేశాడు. ఈ తరహా పాత్రల్లో నటించొద్దని విన్నవించాడు. ఈనెల 29వ తేదీన టిల్లు స్క్వేర్ విడుదల కాబోతోంది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications