అరుదైన వ్యాధితో బాధపడుతున్న అనుష్క
హీరోయిన్ అనుష్క శెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతి తక్కువ కాలంలోనే అనుష్క తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగులో హీరోలతో సమానంగా అనుష్కకు మార్కెట్ ఉందంటే అతిశేయోక్తి కాదు.
అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించేసిందనే చెప్పాలి. జీరోసైజ్ సినిమాతో లావు పెరగిన అనుష్క తరువాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాకిచ్చింది. ఆవెంటనే నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గి మాములు స్థితిలోకి వచ్చింది. గతేడాది యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత మరే సినిమాను అనుష్క అంగీకరించలేదు. కథ నచ్చితే తప్పిస్తే అనుష్క సినిమా ఒప్పుకోదనే విషయం తెలిసిందే.అయితే తాజాగా అనుష్క తన కొత్త సినిమాపై అఫిషియల్‌గా ఎనౌన్స్‌మెంట్ చేసింది. 'కథానర్' అనే సినిమాలో నటించడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ సినిమాతో అనుష్క మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇండస్ట్రీకి వచ్చిన 19 ఏళ్ళ తరువాత మొదటిసారి మలయాళం సినిమాలో నటించబోతుంది అనుష్క.
ఇదిలా ఉంటే అనుష్క ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారట.ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ఒక్కసారి నవ్వడం ప్రారంభిస్తే అనుష్క చాలా సేపు ఆపకుండా నవ్వుతూనే ఉంటుందట. ఎవరైనా జోక్ చేస్తే చాలు పగలబడి నవ్వుతుందట ఈ అమ్మడు. దాని వల్ల సినిమా షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందిపడ్డాను అని చెప్పుకొచ్చింది. నవ్వడం సమస్య ఎలా అవుతుంది అనుకుంటే.. సాధారణంగా మనం ఏదైనా జోక్ వింటే కాసేపు నవ్వుకుంటాం. తర్వాత ఆపేస్తాం. కానీ స్వీటీ విషయంలో అలా కాదంట. పైగా తనకు చాలా త్వరగా నవ్వొస్తుందని చెప్పుకొచ్చింది. ఇది కూడా ఓ వ్యాధిలాంటిదే అని అనుష్కను స్వయంగా చెప్పడం విశేషం.












Click it and Unblock the Notifications