ఒకప్పుడు అల్లు అర్జున్ పక్కన హీరోయిన్..ఇప్పుడు డబ్బులు కోసం ఆ పని
సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే దబ్బకాయ అంత అదృష్టం కూడా ఉండాలి. ముఖ్యంగా హీరోయిన్లుగా రాణించాలంటే చాలా కష్టమనే చెప్పాలి.అందానికి అందం , టాలెంట్‌కు టాలెంట్‌కు ఉన్న చాలామంది హీరోయిన్లు అదృష్టం లేక ఫేడ్ అవుట్ అవుతున్నారు. అలా ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్లలో దీక్షా సేథ్ కూడా ఒకరు.ఆమె 1990 ఫిబ్రవరి 14 న ఢిల్లీలో జన్మించింది. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2009 లో ఫైనలిస్ట్ గా నిలిచింది. 2010 లో వేదం చిత్రంతో ఆమె సినీరంగ ప్రవేశం చేసింది.
మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన దీక్షా సేథ్ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.ఆమె ప్రధానంగా తెలుగు , తమిళ భాషా చిత్రాలలో నటించింది. దీక్షా సేథ్ తెలుగులో వేదం (2010),మిరపకాయ్ (2011),వాంటెడ్ (2011),నిప్పు (2012),ఊ కొడతారా? ఉలిక్కి పడతారా? (2012), రెబల్ (2012) ,నిప్పు (2012)వంటి సినిమాల్లో నటించింది. అలాగే తమిళంలో రాజపట్టై (2011),జాగో (2013),అరవాన్ (2012),మొదలగు సినిమాల్లో నటించింది. విచిత్రం ఏమిటంటే దీక్షా సేథ్ నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి.

ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినప్పటికీ అమ్మడు హిట్ మాత్రం కొట్టలేకపోయింది. దీంతో దీక్షా సేథ్‌కు అవకాశాలు తగ్గిపోయాయి.ఆమె తెరపై కనిపించి చాలా కాలం అయింది. దీంతో ఈ బ్యూటీ గురించి ఇప్పుడు అందరూ గూగుల్‌లో గాలిస్తున్నారు. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది. ఎలా ఉంది అని తెగ సర్చ్ చేస్తున్నారు. అయితే దీక్షా సేథ్ ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నారు.అక్కడే ఆమె ఐటీ ఉద్యోగం చేస్తున్నారు.ఆమె సినీ కెరీర్‌లో మొత్తం ప్లాప్స్ చిత్రాలే ఉన్నాయి. ఆమె కెరీర్‌లో ఒక్క హిట్ కూడా లేకపోవడం విశేషం.దీంతో ఆమెకు ఆఫర్లు రాకపోవడం ఇండస్ట్రీకి దూరమైంది.












Click it and Unblock the Notifications