మరోసారి ఏపీ సీఎం జగనే... జోస్యం చెప్పిన నటుడు విశాల్..
దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సర్వత్రా ఉత్కంట నెలకొంది. ఇలాంటి తరుణంలో ప్రముఖ నటుడు విశాల్ ఏపీ రాజకీయాలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. మరోసారి ఏపీ సిఎం జగనే అవుతారని నటుడు జోస్యం చెప్పాడు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని నటుడు విశాల్ అన్నాడు. ఓ మీడియా ఛానెల్‌లో మాట్లాడిన నటుడు విశాల్ ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై తన అభిప్రాయాన్ని చెప్పారు. ఏదేమైనా ఏపీలో మళ్లీ జగనే సీఎం అవుతారని విశాల్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.
రత్నం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వచ్చిన నటుడు విశాల్ మీడియాతో ఈ సందర్భంగా మాట్లాడారు. వైఎస్ ఆర్ పార్టీకీ తాను మద్దతుదారుడిని కాదని, అయితే జగన్ అంటే తనకు అభిమానమని తెలిపాడు. చాలామంది రాజకీయ నాయకులు నటులుగా మారుతున్నారని, అందుకే నటులు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారని విశాల్ అన్నారు. ఓ పక్క సినిమాలు, మరోపక్క పాలిటిక్స్‌ను బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమని, ఏసీ రూమ్‌లో కూర్చొని రాజకీయాలు చేయలేమని అభిప్రాయపడ్డాడు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన దాడిపై కూడా నటుడు విశాల్ స్పందించారు. ఇలాంటి దాడి గతంలోనూ ఆయన మీద జరిగిందనీ అయినా ఆయన భయపడే రకం కాదని ఈ సందర్భంగా చెప్పారు.

ఏప్రిల్ 26న థియేటర్లలో విశాల్ సినిమా..
నటుడు విశాల్ కోలీవుడ్ లో మంచి పేరును సంపాదించుకున్నాడు. ఒక్క కోలీవుడ్‌కు పరిమితం కాకుండా తెలుగు తమిళ భాషల్లో కూడా చాలా సినిమాలు చేశాడు. అందులో చాలా చిత్రాల రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాల్ని సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం నటుడు విశాల్ రత్నం మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు హరి దర్శకత్వం వహిస్తున్నాడు. హరి గతంలో సింగం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఏప్రిల్ 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.












Click it and Unblock the Notifications