'గేమ్ ఛేంజర్'కు గుడ్ న్యూస్ ..టికెట్ల రేట్ల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం రానే వచ్చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సంక్రాంతి కానుకగా,జనవరి 10న విడుదల కానుంది. తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్, పాటలు ఆకట్టుకున్నాయి. అమెరికాలో సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది చిత్ర యూనిట్. త్వరలోనే ఏపీ, తెలంగాణల్లో ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి చిత్ర నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో 'గేమ్ ఛేంజర్' ఫీవర్ మొదలైంది.
అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ప్రీమియర్స్ సమయంలో ఓ మహిళ మరణించడంతో పాటు ఓ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్‌తో పాటు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్‌పై ఎఫైర్ నమోదు కావడంతో చిక్కడపల్లి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ వివాదం ఇప్పుడు పెద్దగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ సాక్షిగా తెలుగు ఇండస్ట్రీ పెద్దలపై విమర్శలు గుప్పించారు.

తాను సీఎంగా ఉన్న సమయంలో ఇక మీదట ప్రీమియర్స్‌కు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని అనుమతి ఇవ్వబోనని తేల్చిచెప్పారు. ఇది నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద షాకే అని చెప్పాలి. ముఖ్యంగా సంక్రాంతికి విడుదల కాబోతున్న 'గేమ్ ఛేంజర్'పై దీని ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉంటాయా..? టికెట్ రేట్లు పెరుగుతాయా ఆడియెన్స్ ఎదురుచూస్తున్న సమయంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా టికెట్ ధరలను సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 135, మల్టీప్లెక్స్‌లలో రూ. 175గా నిర్ణయించారు. బెనిఫిట్ షోలకు రూ. 600 టికెట్ రేటును ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications