మహేష్ బాబుకు సీఎం జగన్ గుడ్ న్యూస్..తెలంగాణ కంటే ఏపీలోనే అధికం
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా టికెట్లను పెంచుతూ తెలంగాణ సర్కార్ ఇప్పటికే జీవో జారీ చేసింది. జనవరి 12వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంటకు బెనిఫిట్ షోను ప్రదర్శించడానికీ పర్మిషన్ జారీ చేసింది.
సింగిల్ స్క్రీన్ థియేటర్లల్లో ఒక్కో టికెట్‌పై 65 రూపాయలు, మల్టీ ప్లెక్స్‌లల్లో 100 రూపాయలను పెంచుకోవడానికి అనుమతిచ్చింది. వారం రోజుల పాటు అంటే 12 నుంచి 18వ తేదీ వరకు ఈ పెంచిన టికెట్లు అమలులో ఉంటాయి. అలాగే ఈ వారం రోజుల పాటు కూడా రోజూ ఆరు ఆటలను ప్రదర్శించుకోవడానికీ అనుమతులు లభించాయి.

తాజాగా ఈ సినిమా టికెట్ల రేట్ల విషయంలో జగన్ సర్కార్ సైతం కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. గుంటూరు కారం సినిమాకు టికెట్‌పై .50 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక షోలకు సైతం అనుమతినిస్తూ జీవో జారీ చేసింది. ఈ నెల 12 నుంచి 21 వరకు టికెట్ పెంచుకునే అవకాశం ఏపీ ప్రభుత్వం కల్పించింది. తెలంగాణ ప్రభుత్వంతో పోలిస్తే మరో మూడు రోజులు అధికంగా టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం గుంటూరు కారం సినిమాకు జగన్ సర్కార్ అవకాశాన్నిచ్చింది.
ఇది ప్రభాస్ నటించిన సలార్ కంటే బెటర్ అనే చర్చ నడుస్తుంది. త్రివిక్రమ్ - మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడంతో గుంటూరు కారం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పన్స్ లభించింది.












Click it and Unblock the Notifications