వివాదంలో 'కల్కి'..అశ్వినీదత్‌కు నోటీసులు
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా అనుకోని వివాదంలో చిక్కుకుంది. కల్కి సినిమా టికెట్ ధరల పెంపు ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. కల్కి సినిమాకు ఏపీలో 10 రోజులు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే మరో నాలుగు రోజు పాటు అదనంగా టికెట్ల రేట్లు పెంచడంపై ఓ పిటిషనర్ హైకోర్టుకు వెళ్లారు. టికెట్ల రేట్ల పెంపుపై స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం...ఏ సినిమాకైనా ప్రత్యేకంగా టికెట్ ధర పెంచే అధికారం ప్రభుత్వానికి ఉందా లేదా అనేదానిపై హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది.
దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని కల్కి మూవీ నిర్మాత అశ్వినీదత్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఇక గత నెల 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన కల్కి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటోంది. హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో దీపిక పదుకునే, అమీతాబ్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి సెలబ్రిటీలు ముఖ్య పాత్రల్లో కనిపించారు.

పురాణాలకు, కలియుగాంతానికి, కల్కి అవతారానికి లింక్ చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు. కురుక్షేత్ర యుద్ధం జరిగిన ఆరు వేల సంవత్సరాల తర్వాత భూమి మొత్తం నాశనం అవుతుంది. ఆ తర్వాత భూమి మీద ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అనేది కల్కి కథ. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి అడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. రూ.600 భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా కల్కిని తెరకెక్కించారు. ఈ సినిమా కంటెంట్, విజువల్స్, వీఎఫ్ఎక్స్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్‌కు ఆడియన్స్ ఫిదా అవుతూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విడుదలైన మొదటి వారంలోనే ఈ సినిమా రూ. 335 కోట్లు షేర్ వసూలు చేసి సత్తా చాటింది.












Click it and Unblock the Notifications