రా అండ్ రస్టిక్ రొమాన్స్.. పోస్టర్‌తోనే అంచనాలు పెంచేసిన మూవీ!
రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్ల మీద రిజ్వాన్ నిర్మాణంలో కళ్యాణ్‌జీ గోగణ తెరకెక్కించిన సినిమా 'డానీ'. ఈ చిత్రంలో ఆశిష్ గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. రొమాంటిక్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ స్ట్రైక్ అందరినీ ఆకట్టుకుంది. రా అండ్ రస్టిక్, బోల్డ్‌గా ఈ ఫస్ట్ స్ట్రైక్ సినీ వ్యాపార వర్గాల్లో అంచనాల్ని పెంచేసింది. ప్రేమకు, అలవాటుకు మధ్య ఉండే సంఘర్షణతో ఈ చిత్రాన్ని కళ్యాణ్‌జీ గోగన తెరకెక్కించారు.
జీవితంలో ఓ వ్యక్తికి ఉన్న అలవాట్లు ఏంటి? ఆ అలవాట్ల కారణంగా అతడు ఎలాంటి స్థితికి వెళ్లాడు.. అలాంటి వ్యక్తి ప్రేమలో పడ్డాక జీవితం ఎలా మారింది.. ఆ అలవాట్లకు, ఈ ప్రేమకు మధ్య ఏర్పడిన సంఘర్షణ ఏంటి? అన్నది 'డానీ' సినిమాలో చూపించబోతోన్నారు. 'నాటకం' చిత్రంతో కళ్యాణ్‌జీ గోగన-ఆశిష్ గాంధీ కాంబినేషన్‌పై అభిమానులలో మంచి అంచనాలు అయితే ఉంటాయి. ఆ అంచనాల్ని మించేలా ఈ 'డానీ' చిత్రం ఉండబోతోందని చిత్ర బృందం పేర్కొంటోది. ఈ మూవీని నవంబర్ 13న ఘనంగా విడుదల చేయనున్నారు.

ఈ మేరకు వదిలిన రిలీజ్ డేట్ పోస్టర్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంది. హీరో, హీరోయిన్లు పోస్టర్ మీద ఉన్న తీరు, ఆ పోస్టర్ డిజైన్ తీరు ఇలా అన్నీ కూడా కథను ప్రతిబింబించేలా ఉన్నాయి. ఈ చిత్రానికి సాయి కార్తీక్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణ కానుంది. ఈ సినిమాకు ఖుషి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏకే ఆనంద్ కెమెరామెన్‌గా, మణికాంత్ ఎడిటర్‌గా వర్క్ చేశారు. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాను నవంబర్ 13న భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.














Click it and Unblock the Notifications
