ద్రోణి ఎఫెక్ట్, దంచి కొట్టనున్న వానలు..పిడుగులు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
ఎండల తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో నాలుగు రోజులపాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తా యని వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో పాటు ఈశాన్య రుతుపవనాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయింది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి వాయువ్య బంగాళాఖాతం వరకు విస్తరించి, సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతూ ఉంది. వీటి ఫలితంగా ఏపీలో రాగల మూడ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలతో పాటు మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 గరిష్టముగా 60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. అటు రాయలసీమలో రాబోయే మూడ్రోజుల పాటు భారీ వర్షాలు బలమైన గాలులు గంటకు 30-40 గరిష్టముగా 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు
భారీ వర్షాల క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్టణం, పోలవరం, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే విధంగా తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. తాజా అంచనాల ప్రకారం.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.













Click it and Unblock the Notifications
