ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీ అధినేత అభిజీత్ దీప్కే అరెస్ట్!
కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టిన తిరంగా మార్చ్కు కొన్ని నిమిషాల ముందు ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. వారం వ్యవధిలోనే సీజేపీ అధినేత అభిజీత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇది రెండోసారి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో అక్రమాలు జరిగాయంటూ సీఈసీ జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు గతంలో ఆయన ముంబై నుంచి ఢిల్లీకి విమానంలో చేరుకోగానే పోలీసులు తొలిసారి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ తిరంగా మార్చ్ చేపడుతుండటానికి మరో ముఖ్య కారణం అక్టోబర్ 13న జంతర్ మంతర్ వద్ద జరిగిన ఘటన. జంతర్ మంతర్ను నిరసన ప్రాంతంగా డీనోటిఫై చేసిన మరుసటి రోజే.. అక్కడ జాతీయ జెండాతో ప్రవేశించినందుకు కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అరెస్ట్ చేసి 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. దీనికి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ ర్యాలీకి పిలుపునిచ్చింది. అయితే నేడు అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకోవడానికి ముందే ఆయన ఇంటికి వెళ్లిన ఢిల్లీ పోలీసులు, ఈ మార్చ్ నిర్వహించవద్దంటూ అధికారికంగా నోటీసులు అందజేశారు.

బీఎన్ఎస్ సెక్షన్ 163 ప్రకారం జారీ చేసిన ఈ నోటీసులో ఢిల్లీ నగర కేంద్రమైన కన్నాట్ ప్లేస్ పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. అంతే కాకుండా ఈ తిరంగా మార్చ్ కు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్(ఎన్డీఎంసీ) ఎలాంటి ముందస్తు అనుమతి ఇవ్వలేదని.. ఒకవేళ అనుమతి లేకుండా ర్యాలీ కొనసాగిస్తే చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని హెచ్చరించారు.
గాంధీ బొమ్మ ఉన్న తెల్లటి టీ-షర్ట్, బ్లూ డెనిమ్స్ ధరించి భుజంపై జాతీయ జెండా వేసుకున్న 31 ఏళ్ల అభిజీత్ దీప్కేకు పోలీసులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జాతీయ జెండాను ఎగురవేయడం నేరం కాదని, కానీ అనుమతి లేకుండా జనాన్ని సమీకరించి ర్యాలీ నిర్వహించడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేశారు. అలాగే జాతీయ జెండా నియమావళి ప్రకారం జెండాను గౌరవప్రదంగా నిర్వహించాలని సూచించారు. ఇదిలా ఉండగా.. నోటీసులు అందుకుంటున్న సమయంలో "నాపై ఎలాంటి ఆరోపణలు మోపుతున్నారు?" అని అభిజీత్ దీప్కే పోలీసులను ప్రశ్నించగా.. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Abhijeet Dipke has been Detained 🚨They picked him up like a child and threw him into the vehicle 😭 https://t.co/ldg9WzHtSi
— Aditya (@Adityaacard) October 16, 2026













Click it and Unblock the Notifications
