నయనతారకు పిల్లలు ఎలా పుడతారు.. అంతా డ్రామా: వేణుస్వామి

సినీరంగంలోని సెలబ్రిటీలకు, రాజకీయ రంగంలోని సెలబ్రిటీలకు వ్యక్తిగత జాతకాలు చెబుతూ చివరకు తాను కూడా ఒక సెలబ్రిటీ అయిపోయారు వేణుస్వామి. ఆయన చెప్పే జాతకంలో వాస్తవాలెంతో చాలామందికి తెలియదుకానీ సోషల్ మీడియాలో ఈయనకు వచ్చే పబ్లిసిటీ మాత్రం ప్రధానమంత్రికి కూడా రాదు. తరుచుగా ఈయన ప్రభాస్ ను టార్గెట్ చేస్తుంటారు. అతనిమీద ఈయనకేమైనా వ్యక్తిగత కక్ష ఉందేమో అనుకునేంత రేంజ్ లో ప్రభాస్ గురించి అన్నీ నెగెటివ్ చెబుతుంటారు. ప్రభాస్ జాతక చక్రం వేణుస్వామికి ఎవరిచ్చారో ఆయనకే తెలియాలి.

తాజాగా ఆయన నయనతార గురించి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. అసలు ఆమె జాతకంలో సంతాన యోగమే లేదని, అటువంటప్పుడు ఆమెకు పిల్లలు ఎలా పుడతారని ప్రశ్నించారు. అకస్మాత్తుగా నయనతార సరోగసి విధానంద్వారా పిల్లలను కనడానికి ఆమెకున్న లోపమేనన్నారు. సంతాన యోగం లేదని, అందుకే ఆమె సరోగసీ పద్ధతిని ప్లాన్ చేసుకుందన్నారు. అందరు అనుకున్నట్లుగా గ్లామర్ పాడైపోతుందనేది కాదన్నారు. అలా ప్రచారం చేయడం పెద్ద డ్రామా అని వేణుస్వామి అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నయనతారపై వేణుస్వామి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

astroleger venuswamy comments on nayanthara

నెటిజన్లు వేణుస్వామిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. నయనతార విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈయన రెండు వీడియోలు విడుదల చేశారు. వారిద్దరూ విడిపోతారంటూ ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇంతవరకు వారు విడిపోలేదు. దీనికి సంబంధించి ఆయన ఏదో ఒక చిన్న క్లారిటీని కూడా ఇచ్చారు. ఇటీవల సోషల్ మీడియాలో విఘ్నేష్ శివన్ ను అన్ ఫాలో చేయడంతో వేణుస్వామి చెప్పిందే నిజమంటూ, విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే విఘ్నేష్ శివన్ స్పష్టతనివ్వడంతో ఆ గొడవ అంతటితో సద్దుమణిగిపోయింది. సమంత-నాగచైతన్య విషయంలో ఈయన చెప్పింది ఒక్కటే నిజమైందని చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+