జగన్ ఇంటి ముందు బోరుగడ్డ అనిల్ హల్‌చల్..! భార్యతో కలిసి..!

వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిగా పేరున్న బోరుగడ్డ అనిల్ కుమార్ (borugadda anil kumar) చాలా కాలం తర్వాత ఇవాళ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇంటి ముందు ప్రత్యక్ష మయ్యారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయం కమ్ జగన్ నివాసానికి భార్యతో పాటు కలిసి చేరుకున్న ఆయన.. తనను లోపలికి అనుమతించాలంటూ కాసేపు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కాసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరికి బోరుగడ్డను వారు లోపలికి అనుమతించలేదు.

ఏపీ ఆర్దిక పరిస్ధితి ఇదీ..! తేల్చేసిన చంద్రబాబు- శ్వేతపత్రం విడుదల..!
ఏపీ ఆర్దిక పరిస్ధితి ఇదీ..! తేల్చేసిన చంద్రబాబు- శ్వేతపత్రం విడుదల..!

జగన్ సీఎంగా ఉండగా ఆయన పేరుతో దందాలు, బ్లాక్ మెయిలింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న బోరుగడ్డ అనిల్ కుమార్ కూ, తమకూ ఎలాంటి సంబంధం లేదని గతంలోనే వైఎస్సార్సీపీ నేతలు ప్రకటించారు. అయినా జగన్ కు దగ్గరయ్యేందుకు బోరుగడ్డ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో ఇవాళ జగన్ నివాసం వద్దకు వచ్చిన బోరుగడ్డ.. ఆయన్ను కలిసేందుకు అనుమతించాలని సెక్యూరిటీ సిబ్బందిని కోరారు. వారు లోపలకు సమాచారం అందించినా ఎంట్రీ ఇవ్వొద్దని చెప్పినట్లు తెలుస్తోంది.

ysrcp sympathiser borugadda anil protest to meet ys jagan at tadepalli house
ప్రమాదాల్నీ కుట్రగా మార్చేస్తారా?- మీ ఎమ్మెల్యేల సంగతేంటి ? జగన్ ఫైర్..!
ప్రమాదాల్నీ కుట్రగా మార్చేస్తారా?- మీ ఎమ్మెల్యేల సంగతేంటి ? జగన్ ఫైర్..!

దీంతో బోరుగడ్డ వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ఇతర నేతలపై విమర్శలకు దిగారు. సజ్జల, ఇతర నాయకులు తనను జగన్ ను కలవనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గతంలో వైసీపీలో ఓ నాయకుడితో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోను కూడా ఈ సందర్బంగా బోరుగడ్డ బయటపెట్టారు. ఆ ఫోన్ కాల్ లోనే తనను రౌడీ షీటర్ గా పేర్కొంటూ అడ్డుకోవడంపై బోరుగడ్డ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాను రౌడీ షీటర్ ను కాదని స్వయానా హైకోర్టు గతంలో క్లారిటీ ఇచ్చిందని బోరుగడ్డ పేర్కొన్నారు. చివరికి మీడియాతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+