జూనియర్ ఎన్టీఆర్ జాతకం చెప్పిన వేణుస్వామి

వేణుస్వామి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. రాజకీయ రంగంలోని సెలబ్రిటీలకు, సినీరంగంలోని సెలబ్రిటీలకు వ్యక్తిగతంగా వారి వారి జాతకాలు చెబుతూ చివరకు ఈయన కూడా ఓ సెలబ్రిటీలా మారిపోయారని చెప్పవచ్చు. ఒక ప్రణాళిక ప్రకారం ఆయన తనను తాను సెలబ్రిటీలా తీర్చిదిద్దుకున్నారు. ఆయన చెప్పే జాతకాల్లో సగమే జరుగుతాయి.. సగం జరగవు. కానీ జరిగిపోయిన విషయాలను పట్టుకొని ప్రచారం చేయడంవల్ల నిజంగానే ఆయన పెద్ద జ్యోతిష్యుడని కొందరు అమాయకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ఆయన జూనియర్ ఎన్టీఆర్ జాతకానికి సంబంధించిన విషయాలను చెప్పడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొన్నేళ్ల క్రితం ఎన్టీఆర్ తల్లి షాలినిని తిరుపతిలో కలిశానని.. అక్కడ ఎన్టీఆర్ జాతకం గురించి ఆమె తల్లికి చెప్పగా ఆశ్చర్యపోయారని వేణుస్వామి తెలియజేశారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టుకతోనే ఒక సమస్యతో పుట్టారని, ఆ విషయాన్ని షాలినికి చెప్పానన్నారు. తారక్ కు దోషమున్నట్లు, సీనియర్ ఎన్టీఆర్ కు, తనకు, హరికృష్ణకు మాత్రమే తెలుసని, మీకెలా తెలిసిందని ఆశ్చర్యపోయారని వేణుస్వామి తెలిపారు.

astrologer venu swamy about Junior NTR horoscope

జూనియర్ ఎన్టీఆర్ ది మఖా నక్షత్రమని.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితది కూడా అదే నక్షత్రమని, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి చాలా సమయం ఉందని.. రాజకీయాల్లోకి రానివ్వకుండా ఆమె తల్లి అడ్డుపడుతోందంటూ వేణు స్వామి వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ తాతకి రాజయోగం ఎలా ఉండేదో ఇప్పుడు ఎన్టీఆర్ కి కూడా అలాగే రాజ యోగం పడుతుందని, ఆయన నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటాయన్నారు. సినిమా ఎలా తీసినా విజయం సాధిస్తుందన్నారు. ఇన్ని చెప్పిన వేణుస్వామి తారాక్ కు ఉన్న దోషం గురించి మాత్రం చెప్పలేదు. అది ఎటువంటి దోషం అయివుంటుందా? అనే చర్చ నెటిజన్ల మధ్య జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+