'కల్కి' లో దీపిక స్థానంలోకి టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన 'కల్కి 2898 ఏడి' చిత్రం బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. 2024 జూన్ 27 న విడుదలైన ఈ మూవీ రూ. 1100 కోట్లకు పైగా కలెక్షన్ లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,దీపికా పదుకొనే లాంటి స్టార్ యాక్టర్స్ నటించారు. అయితే ఇటీవల కల్కి టీమ్ షాకింగ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ పార్టులో హీరోయిన్‌ గా నటించిన దీపికా పదుకొణె ఇకపై సెకండ్ పార్ట్‌లో భాగం కాదని అధికారికంగా చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రకటించింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుంచి స్టార్ హీరోయిన్ తప్పుకోవడం సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌ గా మారింది.

అయితే 'కల్కి 2898 ఏడి' సీక్వెల్ లో దీపికా పదుకొణె డిమాండ్స్ ను చూసి షాక్ అయిన నిర్మాతలు వెంటనే ఆమెను సినిమా నుండి తప్పించినట్లు సమాచారం. ఇక ఇప్పుడు ఆమె స్థానంలోకి ఎవరిని తీసుకోబోతున్నారు అనే దానిపై పెద్ద చర్చే నడుస్తుంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పుడు మేకర్స్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిని సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. అనుష్క అయితే పాత్రకు పూర్తి న్యాయం చేస్తుందని దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నారట. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Baahubali Reunion Buzz Anushka Shetty to Step into Deepika s Shoes for Kalki Sequel

గతంలో ప్రభాస్.. అనుష్క కాంబినేషన్ లో వచ్చిన మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన కలెక్షన్ల సునామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో మరోసారి బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అనుష్క ఘాటీ చిత్రం ప్లాఫ్ అయింది. ఆమెకు ఇప్పుడు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ అవసరం. ఈ సినిమా అయితే తిరిగి ఫామ్ లోకి రావొచ్చని అనుష్క ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9 న రిలీజ్ కు సిద్ధం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+