'ఇరుముడి' దర్శకుడితో బాలయ్య పవర్ ఫుల్ సినిమా..!
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల అఖండ 2 తో అలరించిన ఆయన ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'దాదా' సినిమా చేస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బోయపాటి దర్శకత్వంలో అఖండ 3 మూవీ కూడా చేయాల్సి ఉంది. అటు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలోనూ బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నారు. NBK112 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. అయితే తాజాగా మరో సినిమాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల మాస్ మహారాజ రవితేజ నటించిన ఇరుముడి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు శివ నిర్వాణతో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు వస్తున్నాయి.
మాస్ మహారాజ ఇరుముడి మూవీ ఆగస్టు 21 న థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించింది. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించి రవితేజ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచింది. వరుస ప్లాఫ్స్ లో ఉన్న ఆయనకు బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ ఫిల్మ్ గా నిలిచింది. ఈ మూవీలో రవితేజ జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించారు. అలాగే కూతురి పాత్రలో బేబీ నక్షత్ర నటించి మెప్పించారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై దీన్ని రవిశంకర్, నవీన్ ఎర్నేని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఈ మూవీ ఇచ్చిన జోష్ లో శివ నిర్వాణ ఇటీవల మైసూరులో బాలయ్యను కలిసినట్లు సమాచారం.

మైసూరులో జరిగిన ఈ భేటీలో బాలకృష్ణకు దర్శకుడు శివ నిర్వాణ ఓ శక్తివంతమైన సబ్జెక్ట్ చెప్పినట్లు తెలుస్తోంది. బాలయ్య బాడీ లాంగ్వేజ్.. మాస్ ఇమేజ్ కు సరిగ్గా సరిపోయేలా ఈ కథను దర్శకుడు సిద్ధం చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ స్టోరీకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. బాలయ్య కు ఇరుముడి లాంటి సినిమా పడితే ఆ బీభత్సం ఎలా ఉంటుందో తెలిసిందే. మరి ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications
