జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వారసుడు కాడా?.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు
అబుదాబిలో ఘనంగా ఐఫా అవార్డుల ప్రదానోత్సవం జరిగిందే. మొదటిరోజు దక్షిణాది సినీ పరిశ్రమకు, రెండోరోజు బాలీవుడ్ కు అవార్డులను నిర్వాహకులు అందజేశారు. మొదటిరోజు కార్యక్రమం మొత్తానికి హైలైట్ గా బాలయ్య, చిరంజీవి, వెంకటేష్ ఒకే ఫ్రేమ్ లో ఉండటం. బాలయ్యకు గోల్డెన్ లెగసీ అవార్డును అందజేశారు. అలాగే భగవంత్ కేసరి చిత్రానికి అనిల్ రావిపూడి ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తనకు ఈ అవార్డును అందించడంపై బాలయ్య ధన్యవాదాలు తెలియజేస్తూ తన వారసుల గురించి మాట్లాడారు.
నాన్నగారి నుంచి నటన వచ్చింది
నాన్నగారు నందమూరి తారకరామారావుగారి నుంచి నటన వచ్చింది. అది తనకు ఎంతో గర్వకారణంగా ఉందని, ఈ అవార్డును ఆయనకే అంకితమిస్తానని బాలయ్య ప్రకటంచారు. తర్వాత సినీ పరిశ్రమలో నందమూరి తారకరామారావు వారసులుగా బాలకృష్ణ కొనసాగుతున్నారు. హరికృష్ణ కొన్ని సినిమాల్లో నటించారు. తర్వాత బాలకృష్ణ వారసులు ఎవరు? అన్న ప్రశ్న ఆయనకు ఎదురైంది. దీనికి బాలయ్య సమాధానమిస్తూ తన కొడుకు మోక్షజ్ఞ, తన మనవడు.. ఇలా బాలయ్య వారసులుగా ఉంటారన్నారు. ఇంతకుమించి ఎవరున్నారన్నారు. బాలయ్యకు వారసులెవరు అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం సరైందే అయినప్పటికీ వారసులు అన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు.. కల్యాణ్ రామ్ ఉన్నాడు.. వారెవరి పేర్లు చెప్పలేదు అంటూ అభిమానులు బాధను వ్యక్తం చేస్తున్నారు.

హరికృష్ణ జీవించి ఉన్నప్పుడు..
హరికృష్ణ జీవించి ఉన్న సమయంలో ఎన్టీఆర్ ను అందరు నందమూరి కుటుంబ సభ్యులు బాగానే చూశారని, బాలయ్య కూడా బాగా చూసుకున్నాడని, హరికృష్ణ మరణానంతరం జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో బాలయ్యకు, తారక్ కు దూరం పెరిగింది. తారక్, కల్యాణ్ రామ్ ఒకటిగా ఉంటున్నారు. తారక్ నందమూరి కుటుంబంలోని ఇతర సభ్యులందరికీ దగ్గరవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే బాలయ్య మాత్రం కొంచెం పెడసరంగా వ్యవహరిస్తున్నాడంటూ విమర్శలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications