దిల్ రాజుపై బండ్ల గణేష్ సంచలన ట్వీట్..!
సినిమా ఇండస్ట్రీ, ఏపీ ప్రభుత్వం మధ్య నడుస్తున్న వివాదంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. టాలీవుడ్ ను ఉద్దేశించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల ఓ లేఖను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ లేఖలో ఆయన సినీ పరిశ్రమపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టారు. పలు కీలక విషయాలు ప్రస్తావించారు.
"ప్రస్తుతం సీనీ ఇండస్ట్రీలో ముదురుతున్న వివాదంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. మంత్రి దుర్గేష్ గారికి ధన్యవాదాలు. 9 రోజుల నుంచి ఉన్న పరిస్థితులకు ముగింపు పలికారు. సమస్య ఎక్కడో మొదలైంది. మంత్రి గారి కృషితో అన్ని ముగిసిపోయాయి. చాలా డైలమా నెలకొని ఉంది ప్రజల్లో. తీర్పు గోదావరి జిల్లాల్లో ఎక్జిబిటర్లు ఈ విషయాన్ని లేవనెత్తారు. వారికి ఉన్న ఇబ్బందులు చెప్పారు. ఏప్రిల్ 19 న విషయం జరిగింది. ఏప్రిల్ 26న గిల్డ్ మీటింగ్ జరిగింది. అప్పుడు మాకు విషయం తెలిసింది. వాళ్ల డిమాండ్లకు ఎగ్జిబిటర్లు , డిస్ట్రిబ్యూటర్లు మధ్య వివాదం ఇది. నిర్మాతల మీటింగ్ లో వాళ్ళని రమ్మని పిలిచాం" అని దిల్ రాజు తెలిపారు.

సినీ ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాల దగ్గరకు వెళ్ళాలని దిల్ రాజు తెలిపారు. ఈ నెల 30 తేదీన జరిగే యాక్షన్ కమిటీ మీటింగ్‌లో ఎగ్జిబిటర్స్ విషయాలు మిగతా సమస్యలు చర్చిస్తామని అన్నారు. ఈ మేరకు పెద్దన్న పవన్ కళ్యాణ్ తిడతాడు.. మేము పడతాము అని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ సంచలన ట్వీట్ చేశారు.

దిల్ రాజు ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలోనే నిర్మాత బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఇండస్ట్రీలో కలకలం రేపుతుంది. ఆస్కార్ నటులు, కమల్ హాసన్ లు ఎక్కువైపోయారు, వీళ్ల నటన చూడలేకపోతున్నాం అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ లో ఆయన ఎవర్ని ఉద్దేశించి అన్నారనేది చర్చనీయాంశంగా మారింది. కానీ సరిగ్గా దిల్ రాజు ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో ట్వీట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఆయన దిల్ రాజుని ఉద్దేశించే ట్వీట్ చేశారేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications