పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గణేష్ ఎమోషనల్ పోస్ట్
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ మీటింగ్ కు హాజరైన పవన్ కల్యాణ్.. ఆరోగ్యం సహకరించక పోవడంతో తిరిగి క్యాంప్ ఆఫీసుకు వెళ్లినట్లు కథనాలు వచ్చాయి. దీంతో పవన్ కు ఏమైంది? అనే చర్చ అటు అభిమానుల్లో ఇటు జనసైనికుల్లో బలంగా వినబడుతోంది. ఈ క్రమంలోనే చేతికి సెలైన్ డ్రిప్ తో కనిపించారు పవన్ కల్యాణ్. దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జ్వరంతోపాటు స్పాండిలైటిస్ అనే సమస్యతో బాధపడిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మీద బండ్ల గణేష్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. "పని అంటే మీరు ఎంత కష్టపడతారో నాకు బాగా తెలుసు.. నడుము విరిగిపోయినా గుర్రపు మీద స్వారీ చేస్తారు.. 103 జ్వరం ఉన్నా డాన్సులు చేస్తారు.. మీకు ప్రజల మీద ఉన్న కమిట్మెంట్ ఏంటో నాకు తెలుసు, కానీ మీ ఆరోగ్యం జాగ్రత్త" అంటూ పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గణేష్ ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అయింది. బండ్ల ట్వీట్ పవన్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

దీంతో పవన్ ఫ్యాన్స్ బండ్ల గణేశ్ ట్వీట్ కు రీ ట్వీట్స్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ గెలిచిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తరువాత మీరు ఆయన్ని మీట్ అయ్యారా? కుదిరితే ఒకసారి ఇప్పుడు కలిసి.. ఇద్దర్ని కలిపి ఒక ఫ్రేమ్ లో చూపించే ప్రయత్నం చేయండి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక పవన్ కల్యాణ్ తో బండ్ల గణేష్ గతంలో తీన్ మార్ చిత్రం నిర్మించారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ తీసిన సంగతి తెలిసిందే. తీన్ మార్ ఫ్లాప్ కావడంతో.. పిలిచి మళ్లీ గబ్బర్ సింగ్ అవకాశాన్ని ఇచ్చాడు పవన్. అది బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బండ్ల గణేష్ కు తిరుగు లేకుండా పోయింది. ఇప్పటి వరకు మళ్లీ బండ్ల గణేష్‌కు ఆ రేంజ్ హిట్ రాలేదు. పవన్ కళ్యాణ్‌కు అది కమ్ బ్యాక్ ఫిల్మ్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక బండ్ల గణేశ్ కాసేపు సినిమాలు, కాసేపు రాజకీయాలు అని చెబుతూ ఉంటారు. ఆయన చివరగా సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో ఓ పాత్ర పోషించారు.












Click it and Unblock the Notifications