పబ్లిక్‌గా పచ్చి బూతులు మాట్లాడిన బండ్ల గణేష్..త్రివిక్రమ్‌పై కూడా కామెంట్స్
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. గత కొంతకాలంగా వరుసగా వార్తల్లో నిలుస్తున్నారాయన. తెలంగాణ ఎన్నికల సమయంలో ఆయన మీడియాలో తెగ హల్ చల్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుగా బండ్ల గణేష్ ప్రచారం కూడా నిర్వహించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సమయంలో బండ్ల గణేష్ చేసిన హడావిడి అంత ఇంత కాదు.
ఫలితాల సమయంలో తనదైనశైలిలో బీఆర్ఎస్ పార్టీపై ట్వీట్లు చేశారాయన. బండ్ల గణేష్ పవన్ కల్యాణ్‌కు వీర భక్తుడనే విషయం అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్ నటించిన తీన్‌మార్, గబ్బర్ సింగ్ సినిమాలకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాతోనే బండ్ల గణేష్ ఇండస్ట్రీలో నిర్మాతగా నిలదొక్కుకున్నారు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు పురస్కరించుకుని ఆయన నటించిన గబ్బర్ సింగ్ రీరీలిజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి దర్శకుడు హరీష్ శంకర్‌తో పాటు, నిర్మాత బండ్ల గణేష్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ..గబ్బర్ సింగ్ ఒక చరిత్ర.. రీ రిలీజ్‌కు ఇంత క్రేజ్ ఏంటి? అని కొంత మంది అన్నారు.. క్రైస్తవులకు బైబిల్.. ముస్లింలకు ఖురాన్.. హిందువులకు భగవద్గీత ఎలానో.. అభిమానులకు గబ్బర్ సింగ్ అలా అని ఆయన చెప్పుకొచ్చారు. ఓ సారి నేను పవన్ కళ్యాణ్‌తో.. బాబు పోలీసోడు గుండీ విప్పుతాడా? అని అంటే. నీకెందుకురా..నువ్వెళ్లి అక్కడ కూర్చో అని అన్నారు.
పదేళ్లు కష్టపడి ప్రజల కోసం పోరాడి.. ఈ రోజు ఒక స్థాయిలో ఉన్నారు.. ఆయన ఒక నిబద్దత గల వ్యక్తి.. ఒకడు ఏదో రికమండేషన్ కోసం అడిగాడు.. ఆయన్ను దూరం నుంచి చూడాలి.. దగ్గరకు వెళ్తే గు.. మీద తంతాడు అని చెప్పా అంటూ స్టేజీ మీదనే ఆయన బూతులు మాట్లాడారు. ఇక స్టేజ్ మీదనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు సారీ చెప్పాడు. ఎవరో అభిమాని ఫోన్ చేశాడు.. ఏదో మూడ్‌లో ఉండి.. అలా అన్నాను.. త్రివిక్రమ్‌కు సారీ అంటూ నాటి ఆడియో లీక్ ఘటన గురించి కూడా చెప్పుకొచ్చాడు. దీంతో అందరి ముందు త్రివిక్రమ్‌కు సారీ చెప్పారు బండ్ల గణేష్.












Click it and Unblock the Notifications